తెలంగాణ ప్రజల పరిస్తితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది అని భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో బాలుడు చనిపోయాడు.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు. గతంలో భువనగిరిలో గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.. సీఎం ఏమో తొక్కుత, పిండుతా అంటూ ఆయన ఎన్నికల బిజీలో ఆయన ఉన్నాడు.. మంత్రులు పదేళ్ల అధికార దాహంతో రాష్ట్రం మీద పడ్డారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. బోర్లు ఎండిపోయాయి.. నీళ్లు, కరెంట్ కష్టాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. సాగర్, శ్రీశైలం ఎండిపోవడానికి ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం కారణం అన్నారు. నల్గొండ జిల్లాలో కొందరు నేతలు రాజకీయం, సంపాదన అంతా తెలంగాణలో.. భజన మాత్రం జగన్ కు.. మొన్నటి దాకా రేవంత్ ను పొట్టోడు అన్నవాళ్లు ఆయన సంకనే చేరి మంత్రి పదవులు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
Read Also: Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
రేవంత్ రెడ్డి రుణమాఫీకి ఆగస్టు 15 అంటూ జనాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది..ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది.. ఈసారి మోడీ 400 సీట్లతో ప్రధాని కాబోతున్నారు.. ప్రస్తుత ముఖ్యమంత్రి ది అంతా గత ముఖ్యమంత్రితో మ్యాచ్ ఫిక్సింగే అని ఆయన ఆరోపణలు చేశారు. అందుకే ఏ ఎంక్వైరీ ముందుకు సాగడం లేదు.. 3D = మోడీ ( 3D- దేశం, ధర్మం, డెవలప్ మెంట్).. ఇక, రాజగోపాల్ రెడ్డి మరో కేఏ పాల్.. దమ్ము ధైర్యం ఉంటే రాజగోపాల్ రెడ్డి భువనగిరిలో ఎంపీగా పోటీ చేయాలి అని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములకు మంచి చిచ్చు పెట్టిండు.. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేది లేదు వీళ్ళకి హోంమంత్రి పదవి వచ్చేది లేదు అని బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు.