Bhupesh Baghel: బీజేపీ పాలనలో పెద్ద కుంభకోణం.. 57 ఆత్మహత్యలపై ఇంకా విచారణ జరగలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhupesh Baghel: రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రభుత్వ ఆధీనంలోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో కుంభకోణం, చిట్ ఫండ్ సంస్థల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపించాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌కు తాను రాసిన రెండు లేఖలను ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ట్వీట్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు స్కామ్‌లపై దర్యాప్తు చేపట్టకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.చిన్న చిన్న విషయాలపై స్పందించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంతపెద్ద కుంభకోణంపై ఎలాంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో సివిల్ సైప్లె కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే.. ఇప్పటివరకూ దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.
నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) లేదా సివిల్ సప్లై కార్పొరేషన్ స్కామ్‌పై విచారణ కోరుతూ రాసిన లేఖలో, రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో అధికారులు దాడి చేసి నగదు, అసమానమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు భూపేష్ బఘేల్ చెప్పారు. కోట్లలో ఆస్తులున్నాయన్నారు. 28 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 16 మందికి కోర్టులో క్లీన్ చిట్ లభించిందని తెలిపారు. చిన్న విషయాల్లో త్వరితగతిన చర్యలు తీసుకునే ఈడీ.. ఈ స్కామ్‌పై విచారణకు ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2019లో నాగ్రిక్ అపూర్తి నిగమ్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిందని, అయితే ఇప్పటివరకు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. 15 రోజులలోపు ఈడీ ఎటువంటి చర్య తీసుకోకపోతే, కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలకు సంబంధించి మరో లేఖలో, 2009- 2017 మధ్య, అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో చిట్ ఫండ్ కంపెనీల ఉపాధి మేళాలను నిర్వహించిందని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. చిత్తశుద్ధి లేని చిట్ ఫండ్ సంస్థలు ఇలాంటి మేళాల ద్వారా యువకులను, అమాయక ప్రజలను మోసం చేసి అనేక కోట్ల రూపాయలను దండుకున్నాయని ఆయన పేర్కొన్నారు.2010- 2016 మధ్య ఈ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయని, వాటిలో కొన్ని కార్యాలయాలు కూడా సీలు చేయబడ్డాయి, అయితే తరువాత వాటిని గత బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్వహించడానికి అనుమతించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
Also Read
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్‌పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు
161 కంపెనీలపై 310 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా వాటి నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేదు. అలాంటి కంపెనీలకు చెందిన 57 మంది ఏజెంట్లు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని, కొందరు హత్యకు గురయ్యారని, అయితే అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు. రాజ్‌నంద్‌గావ్, సుర్గుజాలో (2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత) కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, ఇందులో బీజేపీ మాజీ ఎంపీలు అభిషేక్ సింగ్, మధుసూదన్ యాదవ్, బీజేపీ రాజ్‌నంద్‌గావ్ జిల్లా యూనిట్ చీఫ్, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు, పెట్టుబడిదారుల నుండి 25 లక్షల దరఖాస్తులు అందాయని (వారి డబ్బును తిరిగి ఇవ్వాలని కోరుతూ) ఈ కుంభకోణం సుమారు రూ. 6,500 కోట్లు అని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
-
Putin: పుతిన్ భద్రతపై రష్యా సంచలన నిర్ణయం.. నిఘా వ్యవస్థలపై తాత్కాలికంగా..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!