Site icon NTV Telugu

Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..

Bhumana Karunakara Reddy

Bhumana Karunakara Reddy

తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వచ్చాక జరుగుతున్నది ఏంటని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. “మీ పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడింది. అంటే టీటీడీ వైఫల్యం మరోసారి విఫలమైంది. మారణాయుధాలుతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితి కి తీసుకువచ్చారు. మీ ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు. టీడీపీ నాయకులు సేవలో టీటీడీ ఛైర్మన్ పనిచేస్తున్నారు. భక్తులను పట్టించుకోవడం లేదు” అని టీటీడీ మాజీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు.

READ MORE: UCO Bank Recruitment 2025: యూకో బ్యాంకులో లోకల్‌ బ్యాంకు ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ. 85 వేల జీతం

కూటమి ప్రభుత్వం హయాంలో తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ 4సార్లు పట్టు బడ్డారని.. 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారని భూమన ఆరోపించారు. లడ్డు ప్రసాదం విషయంలో తమపై నింద మోపారన్నారు. తమపై నేరారోపణలు చేశారని గుర్తు చేశారు. సనాతన హిందూ ధర్మం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబును ప్రశ్నించాలని.. పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలుకు కోరారు.

READ MORE: UCO Bank Recruitment 2025: యూకో బ్యాంకులో లోకల్‌ బ్యాంకు ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ. 85 వేల జీతం

Exit mobile version