Site icon NTV Telugu

Bhumana Karunakar Reddy: కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీ..! పల్లె పల్లెకి కల్తీ లిక్కర్..!

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: ప్రతిచోట కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారి కోసం ఏర్పాటు చేశారు.. పల్లె పల్లెకి నకిలీ మద్యాన్ని పంపిన ఘతన టీడీపీ నేతలదే అని ఆరోపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి.. మా మీద లిక్కర్ కేసు అంటూ అసత్య ప్రచారం చేశారు‌‌‌.. జైల్లో పెట్టారు‌.. కానీ, ప్రతిచోట కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారి కోసం ఎర్పాటు చేశారని టీడీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు.. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం వాళ్ల పార్టీ తరపున పోటీ చేసి వ్యక్తి నకిలీ మద్యం కోసం ఒక డెన్ పెట్టి దొరకడం అన్నారు.. ప్రతి బ్రాందీ చాలు ఇక బెల్ట్ షాపు గా మారిపోయింది… నకిలీ మద్యాన్ని పల్లె పల్లెకి టీడీపీ నేతలు పంపారని ఫైర్‌ అయ్యారు..

Read Also: Son Kills Mother: తల్లిని కొడుకు హత్య చేసిన కేసులో షాకింగ్‌ ట్విస్ట్..! తాను దేవుడిని అంటే నమ్మలేదు.. అందుకే..!

ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టిటిడి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి ఇవ్వడం ఏంటి‌.. ? అని ప్రశ్నించారు భూమన.. బీజేపీ నేత అన్నామలై ఈ కంపెనీ పై చాలా రకాల అవినీతి ఆరోపణలు చేశారు‌.. ఈడీ దర్యాప్తు కోరారు… అలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో టీటీడీ ఆలయం ఎలా ‌కడుతారా ? అని నిలదీశారు. ఇలా అయితే రోజుకొక రియల్ ఎస్టేట్ కంపెని టీటీడీ ఆలయం కట్టాలని అడుగుతుందన్నారు.. ఇక, హిందువులు మనోభావాలను దెబ్బతినేలా టీటీడీ వ్యవహారం ఉందన్నారు టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి..

Exit mobile version