Site icon NTV Telugu

Bhuma Akhilapriya: ఎమ్మెల్యే శిల్పా రవిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్

Bhuma Akhilapriya

Bhuma Akhilapriya

Bhuma Akhilapriya: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే శిల్పా రవి అహంకారంతో విర్రవీగిపోతున్నాడని ఆమె మండిపడ్డారు. బహిరంగ చర్చకు పిలిస్తే , ఆళ్లగడ్డకు పోలీసులను పంపారని, టీడీపీలో ఇద్దరు ,ముగ్గురు నేతలు ఉన్నారని ఎగతాళి చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తరఫున చెప్తున్నా, ఏ లీడర్‌నైనా సెలెక్ట్ చేసుకో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రెడీ అంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు కూడా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Also Read: Janareddy: వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్ బరిలో ఉంటా

అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము నీకుందా అంటూ సవాల్‌ విసిరారు. నీ స్థలాల రేట్లు పెంచుకోవడానికి బొగ్గు లైన్ వాసులను రోడ్డుపాలు చేస్తావా అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. భూమి సరిగ్గా లేని, వరదలు వచ్చే కుందు ఉన్న వద్ద పట్టాలిస్తావా అంటూ ఆరోపణలు చేశారు. కుందు ప్రాంతానికి వెళ్లి నువ్వు ఇల్లు కట్టుకొని, నీ తండ్రితో కలిసి ఉండగలవా అంటూ ప్రశ్నించారు. బొగ్గు లైన్ వారికోసం న్యాయపోరాటం చేస్తామని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.

 

Exit mobile version