Bhuma Akhila Priya: ప్రజలకు మీరేదో పథకాలు ఇస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ, ఆ పథకాలన్నీ ఎన్నికల్లో పనిచేయబోవని అంటున్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిల ప్రియ.. చంద్రబాబు చేయని తప్పుకు అనవసరంగా జైలుకు పంపిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు 300 కోట్ల రూపాయలు కాదు కదా 3 రూపాయలు కూడా తీసుకొని ఉండరని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఓటర్ల రీ వెరిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడే వైసీపీకి భయం పుట్టి చంద్రబాబును అరెస్ట్ చేయించిందని విమర్శించారు. ఇక, ప్రజలకు ఇచ్చేది వంద అయితే.. ప్రజల నుంచి దోచుకునేది 200 రూపాయలు అని ఆరోపించారు. భూ సర్వే పేరుతో 17 ఎకరాలు ఉన్న రైతుకు అన్యాయంగా రీ సర్వేలో రెండు ఎకరాలు చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అఖిలప్రియ. మూడు రోజుల లోపల ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ల పొలాలను వాళ్లకు చూపిస్తే సరి, లేదంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడానికి రెడీగా ఉన్నాం అని హెచ్చరించారు. మరోవైపు.. ఎమ్మెల్యే ప్రజల సొమ్ము ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నాడు.. తప్ప ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఈ సారి మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ మరో బీహార్ అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
Read Also: Yogi Adityanath: సైనికులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం