ఐఐటీ స్టూడెంట్ ఆకస్మిక మరణం.. తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులను షాక్ కు గురిచేసింది. తెల్లవారితే పరీక్ష ఉందని అర్థరాత్రి వరకు చదువుకున్న విద్యార్థి.. కానీ పరీక్షకు ముందే ఉదయం వేళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వారణాసిలోని IIT-BHUలో చోటుచేసుకుంది. MTech విద్యార్థి అనూప్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం పరీక్ష రాయాల్సి ఉంది. మంగళవారం రాత్రి, అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గదిలో చదువుకున్నాడు. ముగ్గురు తెల్లవారుజామున 3 గంటల వరకు చదివి, ఆపై నిద్రపోయారు. అతని స్నేహితులు ఉదయం 6 గంటల ప్రాంతంలో అనూప్‌ను నిద్రలేపడానికి ప్రయత్నించగా, అతను మేల్కొనలేదు.
Also Read:Ramchander Rao: బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు… కవితను పార్టీ లోకి తీసుకోము..
అనుప్ శరీరం కొద్దిగా వెచ్చగా ఉంది. విద్యార్థులు అతనికి CPR కూడా చేశారు. కానీ ఫలితం లేదు. వారు వెంటనే IIT మేనేజ్ మెంట్ కు సమాచారం అందించారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. అనుప్‌ను బిహెచ్‌యులోని సర్ సుందర్ లాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు ప్రకటించారు. అనుప్ మరణానికి కారణం బహుశా గుండెపోటు అని వైద్యులు తెలిపారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు.
పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. అనూప్ సింగ్ చౌహాన్ అజంగఢ్ నివాసి. అతని తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది. ఈ కేసులో తండ్రి ఎవరిపైనా ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అనుప్ తండ్రి వినోద్ సింగ్ మాట్లాడుతూ, అనుప్ తన పెద్ద కొడుకు అని అన్నారు. చిన్న కొడుకు ఢిల్లీలో UPSC కి ప్రిపేర్ అవుతున్నాడని తెలిపాడు. రాత్రి 11:30 గంటలకు అనుప్ తన తమ్ముడితో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించాడు. ఇంతలోనే కానరానిలోకాలకు వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
