Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake IAS Officer: భోపాల్‌లో వెలుగుచూసిన నకిలీ ఐఏఎస్ అధికారిణి తృప్తి సింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలపై తృప్తి సింగ్‌పై ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ కేసులో లంచాలకు డిమాండ్ చేశారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసు విచారణ శైలిపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో బైతుల్ ప్రాంతానికి చెందిన ఖ్యాతి అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు అత్యంత కీలకంగా మారింది. ఉద్యోగం పేరిట తృప్తి సింగ్ తనను మోసం చేసిందని భావించిన ఖ్యాతి, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాగ్ సేవనియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసును విచారిస్తున్న ఏఎస్ఐ మనోజ్ శర్మ, కానిస్టేబుల్ సునీల్ రాథోడ్ తమ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారని ఖ్యాతి ఆరోపిస్తోంది. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆమెనే ఈ కేసులో ముద్దాయిగా చేరుస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు తెలిపింది. గతంలో నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ బ్యాంక్ ఖాతా నుంచి ఖ్యాతి ఖాతాలోకి కొంత మొత్తం జమ కాగా, ఆ విషయాన్నే ఆసరాగా చేసుకుని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె పేర్కొంది.
బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. బాధితులను భయపెడుతున్నారనే విషయమై ఏఎస్ఐ మనోజ్ శర్మ, కానిస్టేబుల్ సునీల్ రాథోడ్‌లపై లంచం ఆరోపణలతో పాటు పలు ఫిర్యాదులు అందాయని ఏసీపీ రజనీష్ కశ్యప్ ధృవీకరించారు. విచారణలో వారి ప్రమేయంపై ప్రాథమిక సమాచారం రావడంతో, ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు వారిద్దరినీ తక్షణమే బాగ్ సేవనియా పోలీస్ స్టేషన్ నుంచి తొలగించి లైన్ అటాచ్ (విభాగపు చర్యలు) చేశారు. ఒకవైపు నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్‌పై బాగ్ సేవనియా పోలీసు స్టేషన్లో నమోదైన మూడు ఎఫ్ఐఆర్ల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతుండగా, మరోవైపు అదే కేసును విచారిస్తున్న సిబ్బందిపైనే విచారణ ఎదురవడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులపై వచ్చిన లంచం ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుగుతోంది. పోలీసు సిబ్బంది వైపు నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ రానప్పటికీ, ఈ విచారణ పూర్తయిన తర్వాతే ఆరోపణల్లో ఎంతవరకు నిజముందనేది పూర్తి స్పష్టత రానుంది.
Also Read
- PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
-
PM Vishwakarma Yojana: సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలా? గ్యారెంటీ లేకుండానే రూ.3 లక్షల లోన్.. పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!