Dharmasthala case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో చెన్నయ్య అలియాస్ భీమాపై ఆయన మాజీ భార్య రత్నమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మస్థలలో తాను పెద్ద సంఖ్యలో మహిళల శవాలు పాతినట్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హడలెత్తించిన భీమ ఆరోపణల్లో నిజం లేదని సిట్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. మాండ్యా జిల్లాలో చిక్కబళ్లి గ్రామానికి చెందిన అతడిని దర్యాప్తు బృందం విచారిస్తోంది. తాజాగా అతడి మాజీ భార్య రత్నమ్మ మీడియా ఎదుటకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. చిన్నయ్య తనతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ అత్యాచారాలు, హత్యలు, సామూహిక ఖననాల ఘటనల గురించి చెప్పలేదని రత్నమ్మ వెల్లడించింది. డబ్బు కోసమే అతడు ధర్మస్థలలో వివాదం సృష్టించి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
READ ALSO: Rahul Gandhi: ఈసీకి బీజేపీతో పొత్తు ఉంది.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
నిరుద్యోగిని అని అబద్ధాలు చెప్పాడు..
నాగమంగళలో సివిక్ వర్కర్‌గా పనిచేసిన రత్నమ్మ భీమాను 1999లో పెళ్లి చేసుకొంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో వారు విడిపోయారు. ఈసందర్భంగా రత్నమ్మ మాట్లాడుతూ.. చెన్నయ్య అలియాస్ భీమా తనను తీవ్రంగా కొట్టేవాడని పేర్కొంది. విడాకుల సమయంలో కోర్టులో నిరుద్యోగిని అని అబద్ధాలు చెప్పి, తనకు భరణం ఎగ్గొట్టాడని చెప్పింది. దీంతో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, కొన్నాళ్ల పాటు తనను తల్లి చూసుకొందని, ఆ తర్వాత బిడ్డల అండతో జీవిస్తున్నట్లు పేర్కొంది.
భీమా ధర్మస్థలలో ఉండగా మొత్తం మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకొన్నాడని, అందరి నుంచి విడిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన 2014లో ధర్మస్థల నుంచి ఓ మహిళతో కలిసి స్వగ్రామానికి వెళ్లి ఆమెను తన భార్యగా ఊళ్లోని వారికి చెప్పాడని అన్నారు. చిక్కబళ్లికి చెందిన బాలు అనే వ్యక్తి మాట్లాడుతూ.. భీమా డబ్బుకోసం ఏమైనా చేస్తాడని ఆరోపించాడు. చిన్నయ్య మూడో తరగతి వరకు ఇదే గ్రామంలో చదువుకున్నాడని, తర్వాత బడి మానేసి జులాయిగా తిరిగేవాడని అన్నారు. చిన్న వయసులోనే తనకు వివాహమైందని, ధర్మస్థలకు మొదట అతడి సోదరుడు తన్యాసి వెళ్లి పనిలో చేరాడని చెప్పారు. తర్వాత చిన్నయ్య 1994లో పనికి వెళ్లేవాడని అన్నారు. 2024 ఆయన గ్రామ పంచాయతీ స్థలాన్ని తనపేరు మీద రాసి ఇవ్వాలని సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడని ఆ గ్రామ ప్రజలు ‘సిట్ అధికారులకు చెప్పారు.
READ ALSO: Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..