Site icon NTV Telugu

Bhola Shankar : యమహా నగరి బ్యాక్‌డ్రాప్‌ మ్యాజిక్‌ రిపీట్ చేయబోతున్న చిరు

Bhola Shankar

Bhola Shankar

వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. స్టైలిష్ ఫిలింమేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తమిళ చిత్రం వేదాళంకు రీమేక్. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై ఘనవిజయం సాధించింది. మళ్లీ 8ఏళ్ల తరవాత తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆయన సరసన తమన్నా హీరోయిన్ పాత్ర పోషిస్తుంది.

https://twitter.com/BholaaShankar/status/1653746881368047616

Also Read : Allari naresh: కామెడీ చేసేవాళ్లంటే చిన్న చూపు

ఈ ఏడాది ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను, ఓ సాంగ్ ను పూర్తిచేసుకున్న చిత్ర బృందం.. కొత్త షెడ్యూల్ కోసం కోల్‌కతాకు బయలుదేరి వెళ్లింది. ఇవాళ్టి నుంచి యమహా నగరిలో షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని వుంది’ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుంది. అయితే ఈ సినిమా బాక్స్ ఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమా కూడా అదే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోంది అని తెలుస్తుంది. కాబట్టి, ‘చూడాలని వుంది’ మ్యాజిక్‌ను మెగాస్టార్ చిరంజీవి రిపీట్ చేయబోతున్నారని చిత్ర బృందం అంటుంది.

Also Read : Press Freedom Index: మీడియా స్వేచ్ఛలో మరింత దిగువకు ఇండియా.. ఎన్నో స్థానం అంటే..

ఈ మూవీలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో ఇటీవల షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు మిగిలిన సన్నివేశాలను కోల్‌కతాలో ఇవాళ్టి నుంచి చిత్రీకరించనున్నారు.

Also Read : Bangladesh: తనను నిరాకరించిందని హిందూ బాలిక దారుణ హత్య..

కోల్‌కతా షెడ్యూల్‌లో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, ఇతర నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను కూడా చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్‌లో సాంగ్ చిత్రీకరిస్తామని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూన్ నెలాఖరుకు మూవీ చిత్రీకరణ పూర్తిచేస్తారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

Exit mobile version