Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bhimavaram Superstar Krishna Statue Controversy High Court Stay

Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం చుట్టూ వివాదం..

Published Date :December 20, 2025 , 4:41 pm
By Shiva Ganesh
  • హైకోర్టును ఆశ్రయించిన అభిమానులు
  • స్టే ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం
Bhimavaram Krishna Statue Issue: భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం చుట్టూ వివాదం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhimavaram Krishna Statue Issue: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటుడు, తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. భీమవరం పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద గత 12-04-2024 తేదీన కృష్ణ అభిమానులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చినప్పటికీ, అదే అధికారులు ఇప్పుడు దానిని అనధికార విగ్రహంగా పేర్కొంటూ తొలగించేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

READ ALSO: Physically Abuse: ట్రైన్లో మహిళపై అత్యాచారం.. ఆర్మీ జవాన్ అరెస్టు

Also Read

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..
  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!

తాజాగా మున్సిపల్ అధికారులు కృష్ణ అభిమానులకు 24 గంటల్లో విగ్రహాన్ని తొలగించాలి అంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా అనుమతులు తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, అదే అధికారులు ఇప్పుడు నిబంధనల పేరుతో తొలగించేందుకు ప్రయత్నించడం అన్యాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ విగ్రహం తొలగింపునకు వ్యతిరేకంగా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు అన్ని సినీ హీరోల సంఘాల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న అభిమాన గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని విగ్రహాన్ని తొలగించకూడదని డిమాండ్ చేశారు. విగ్రహం ప్రజాభావోద్వేగాలతో ముడిపడి ఉందని, దీనిని తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా కృష్ణ అభిమాన సంఘం నాయకుడు రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విగ్రహం ఏర్పాటు చట్టబద్ధమేనని, అధికారులే అనుమతి ఇచ్చి, ఇప్పుడు మళ్లీ తొలగించేందుకు ప్రయత్నించడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విగ్రహం తొలగింపుపై స్టే ఉత్తర్వులు మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహాన్ని తొలగించకూడదని ఈ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో కృష్ణ అభిమానులు ఊరట పొందారు. హైకోర్టు తదుపరి విచారణలో తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

READ ALSO: Andhra King Thaluka OTT Release: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’… స్ట్రీమింగ్ ఏ రోజున అంటే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh local news
  • AP High Court stay order
  • Bhimavaram Krishna statue issue
  • Edward Tank Bhimavaram statue
  • Krishna fans protest

తాజావార్తలు

  • Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..

  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!

  • Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..

  • Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions