NTV Telugu Site icon

Grandhi Srinivas: చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేందుకు పవన్ సిద్ధమయ్యారు..

Grandhi

Grandhi

Bhimavaram MLA: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కామెంట్స్ చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది అని పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇల్లు కొనడానికి వస్తే నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు.. పవన్ వస్తే నాకు ఉన్న 9 ఎకరల్లో ఎంత కావాలంటే అంత ఇస్తాను అని ఆయన తెలిపారు. భీవవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏమీ అనుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకో పవన్ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు.

Read Also: Delhi Court : గ్యాంగ్‌స్టర్ కాలా జాతేడికి పెళ్లయిన వెంటనే పెద్ద షాకిచ్చిన ఢిల్లీ కోర్టు

నీ అభిమానులకు సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు.. అందుకే నీ నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియడం లేదు అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 సీట్లకు ఒప్పుకుని ఇపుడు 21 సీట్లు అంటున్నారు.. సొంత అన్నయ్యతో విభేదించా అంటున్నారు.. చిరంజీవికి పవన్ కు పోలిక ఏంటి అని ప్రశ్నించారు. 18 సీట్లు, 80 లక్షల ఓట్లు వచ్చాయి.. చిరంజీవి చాలా సౌమ్యుడు… మరో అన్న నాగబాబుకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారు అని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.

Read Also: Crime News: బెంగళూరులో దారుణం.. యువతిని వివస్త్రను చేసి ఆపై..!

పవన్ కల్యాణ్ ను మంచి మానసిక వైదుడుకి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలనే అనుమానం వస్తుంది అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. వ్యాధి ముదిరితే ప్రాణాంతకం అవుతుంది.. పోటీ చేసిన తర్వాత భీమవరం మొహం మళ్ళీ చూడలేదు.. కోవిడ్ సమయంలో ప్రజలు ఏం అయిపోయారు అనేది కూడా చూడలేదు.. ఉసరవెల్లి లాంటి వ్యక్తి పులపర్తి రామాంజనేయులు.. ప్రజల తాగునీటి పేరుతో 50 ఏకరాల భూములు దోచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంటూ ఆయన ఆరోపించారు. డంపింగ్ యార్డ్ కోసం ఇప్పటికే స్థలం కేటాయించడం జరిగింది.. మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసులు ఒక్కటి కూడా లేదు.. రౌడీయిజం చేస్తున్న అంటున్నారు.. నాపై ఒక్క క్రిమినల్ కేసు ఎక్కడైనా ఉందా అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు.