టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన కొత్త సినిమా భీమా.. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లు. కన్నడ దర్శకుడు ఎ హర్ష తెరకెక్కించిన చిత్రమిది. ‘పంతం’ తర్వాత గోపీచంద్ హీరోగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా.. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.. శివరాత్రి కానుకగా ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
యాక్షన్ సీక్వెన్స్‌లు భీమా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని చెబుతున్నారు. పరశురామ క్షేత్రానికి సంబంధించిన డివోషనల్ పాయింట్‌ను కూడా దర్శకుడు బాగా రాసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నీవేశాలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అండ్ క్లైమాక్స్ అదిరిపోయాయట. మరీ ముఖ్యంగా కమర్షియల్ హంగులతో పాటు సినిమాలో కంటెంట్ కూడా బావుందని చెబుతున్నారు. ‘భీమా’తో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కేశారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సినిమాలోని యాక్షన్ హైలెట్ అని చెబుతున్నారు..
గోపీచంద్ అభిమానులకు ‘భీమా’ డబుల్ ట్రీట్ అందిస్తుందని ప్రీమియర్ షోస్, ఫిల్మ్ నగర్ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ‘భీమా’లో గోపీచంద్ డ్యూయల్ లుక్ ఆల్రెడీ ట్రైలర్లలో రివీల్ అయ్యింది.. గోపిచంద్ యాక్షన్ లో విజ్రూంభించాడని మరో ఫ్యాన్ ట్వీట్ చేశారు..
భీమా’ సినిమాలో పోలీస్ రోల్ వాటికి భిన్నంగా, చాలా కొత్తగా ఉంటుందని నెటిజనులతో పాటు సినిమా చూసిన ప్రముఖులు చెబుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఉగ్రరూపాన్ని చూడవచ్చు అని చెబుతున్నారు..
పబ్లిక్ మాటల్లో వింటుంటే సినిమా హిట్ టాక్ ను అందుకున్నట్లే అని తెలుస్తుంది.. గోపీచంద్ ఖాతాలో హిట్ పడినట్లే.. ఇక కలెక్షన్స్ ఏ మాత్రం ఉంటాయో చూడాలి..
Hit bomma #BHIMAA
— Hari (@Hari_Munagapati) March 8, 2024
INTERVAL AND CLIMAX 🥵🥵💣#BHIMAA pic.twitter.com/au3ywV3DZa
— OG ⚔️ VENKATESH (@og_venkatesh) March 8, 2024
#BHIMAA 🔥🔥🔥
The Ultimate performance by #Gopichand is back on a hit track, full of mass elements and good content. #MalvikaSharma ❤️😍#PriyaBhavaniShankar 😍👌👌#BhimaaReview pic.twitter.com/P9vNN6SmjD
— CHITRAMBHALARE (@chitrambhalareI) March 7, 2024