NTV Telugu Site icon

Bhatti Vikramarka : ఫామ్ హౌస్‌లు వెనకటి గడీలను తలపిస్తున్నాయి..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరు అందించే తపాసుపల్లి ప్రాజెక్టు ను కేసిఆర్ నిర్లక్ష్యం చేశారన ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆయన ఇవాళ యాదాద్రి జిల్లాలో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. భూముల మీద, ఫామ్ హౌస్ మక్కువతో నియోజకవర్గంను ఎమ్మెల్యే తాకట్టు పెట్టారని, కాలు అడ్డం పెడితే నీళ్ళు వస్తాయి అన్న కేసిఆర్.. ఎప్పుడు కాళ్ళు అడ్డం పెడతారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘కరువు, భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు వలస పోతున్నారు.. రాష్ట్రంలో ఎమ్మెల్యే లు అక్రమంగా భూములు పోగేసుకుంటున్నరు. ఫామ్ హౌస్ లు వెనకటి గడిలను తలపిస్తున్నాయి.. రాష్ట్రంలో ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ అమలులో ఉందా లేదా…? ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ఆమలులో ఉంటే వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు ఎలా వస్తున్నాయి.. తెలంగాణా పున్నిర్మాణం పేరిట.. తెలంగాణా ను విధ్వంసం చేస్తున్నరు..

Also Read : MS Dhoni: ధోనీకి ఇదే చివరి సీజనా.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే కోచ్

రాష్ట్రం అంటే మనుషులు, భూమి, వనరులు, సంపద…. ప్రజలు వెలిగిపోవాలి, కేసిఆర్ కాదు.. నీళ్లు కావాలి, ఉద్యోగాలు రావాలి… తెచ్చిన అప్పులపైన, 9 సంత్సరాలకాలంగా తెలంగాణా లో చేసిన అభివృద్ధిపై clp leader గా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న.. తెలంగాణా మాత్రమే వచ్చింది… జరగాల్సిన అభివృద్ధి జరగడం లేదు.. ఆనాడు ఆంధ్ర ప్రజలపై ఏ విధంగా అయితే పోరాటం చేసామో… ప్రస్తుతం కెసిఆర్ పై కూడా అదే విధంగా పోరాటం చేయాలి.. నిజాం కాలంలో నిజం ధనవంతుడుగా ఉండి.. ప్రజలు పేదలుగా ఉండేవారు.. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి…. ధరణి వల్ల 70 సంవత్సరాలుగా భూమిపై ఉన్న హక్కును భూ యజమానులు ఆ హక్కును కోల్పోయారు.. నేతల మధ్య బిన్నాబిప్రాయలు ఉండటం సహజం.. అలా బిన్నాబిప్రాయలు లేకపోతే నియంతృత్వం అవుతుంది..’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Also Read : విడాకులు తీసుకొనే దేశాల్లో మన ఇండియా ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..?