NTV Telugu Site icon

Bhatti Vikramarka : ఆదిలాబాద్‌లో అడవి బిడ్డలు అత్యంత ధైర్యవంతులు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. పీచర కార్నర్ మీటింగ్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేను ఇక్కడకు వచ్చింది.. ఓట్ల కోసం కాదు, ఎన్నికల కోసం అంతకన్నా కాదు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే ఆదిలాబాద్ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్నానన్నారు. అనేక రోజులుగా.. అనేక గ్రామాలను, పల్లెల్లో పాదయాత్ర చేస్తూ చాలామందిని కలిసి వస్తున్నానని, ఆదిలాబాద్ లో అడవి బిడ్డలు అత్యంత ధైర్యవంతులు. వారికి అడవే జీవితం. అడవి వారికి అమ్మవంటిది. అలాంటి అడవిపై వారికి హక్కులు కలిగిస్తూ శ్రీమతి సోనియాగాంధీ నేత్రుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి అడవిపై హక్కులు తొలగించింది. దీంతో నీళ్లలోని చేపబయట పడితే ఎలా కొట్టుకుంటుందో.. ఆదివాసీలు, అడవిబిడ్డల పరిస్థితి అలా ఉంది.ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని త్వరగా వదిలించుకోవాలని అడవి బిడ్డలు ఎదురు చూస్తున్నారు.

Also Read : Karnataka Elections: “విషపు పాము” వ్యాఖ్యలు కాంగ్రెస్ కొంప ముంచుతుందా..? చివరకు ఆ పార్టీనే కాటేస్తుందా..?

ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటాం.. మా హాక్కులు మళ్లీ పొందుతాం అని వారు చెబుతున్నారు. అక్కడనుంచి బొగ్గుబావుల గని సింగరేణి ప్రాంతానికి వచ్చాము. అక్కడ కూడా ఉద్యోగుల, ప్రజలను కలిశాను. ఈ దుర్మార్గ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా.. సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను తీసేస్తోందని చెప్పారు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయనుకున్నా.. ఉద్యమాలు చేశాం.. ఇప్పుడు బొగ్గు బావుల్ని కేసీఆర్ తనకు కావాల్సిన వారికి ఇచ్చేస్తున్నాడు. సంపద మొత్తం దోపిడీ చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు ఇవ్వక.. అటు సహజ సంపదను దోచి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పారు. ప్రజల సంపద ప్రజలకు అందకుండా చేస్తున్నాడు. ఈ దుర్మార్గ ప్రభుత్వం గోదావరి నీళ్లు రాకుండా చేస్తోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవళ్ల ప్రాజెక్టు పూర్తచేస్తే ఇక్కడ భూములు సస్యశ్యామలం అయ్యేవి.. కానీ అది పూర్తిచేయకుండా చేసి నీళ్లును రాకుండా అడ్డుకున్నాడు.

Also Read : స్త్రీలు తమకు నచ్చిన మగావాళ్లతో మాత్రమే ఇలా ఉంటారంట.

వచ్చే దారిలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను కలిశాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువులు వస్తాయనుకుంటే.. ఈ దుర్మార్గుడు 9 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. లేకలేక ఒక్క నోటిఫికేషన్ ఇస్తే.. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి.. మా లక్ష్యాలను లక్షలకు అమ్ముకున్నాడు. విద్యార్థలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాడు. తెలంగాణలో ఎవర్ని కదిలించినా.. సమస్యలు, బాధలే చెబుతున్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి కుటుంబం కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలించుకునే ఆలోచనలో ఉంది. పెన్షన్ రావడం లేదు. కొత్త రేషన్ కార్డు లేదు. పిల్లలు చదుకోవడానికి బడి లేదు. చదువున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు.

ఇక్కడనుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి విద్యావ్యాపారులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ విద్యాలయాలు మూసేసే కుట్రను చేస్తున్నారు. విద్యను పల్లా రాజేశ్వర్ రెడ్డిలాంటివాళ్లు పేదలకు అందకుండా.. లక్షల రూపాయలకు విద్యను అమ్ముకుంటున్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చుందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌరెళ్లి ప్రాజెక్టును పూర్తిచేసుంటే ఇక్కడి భూములు బంగారం పండేది. నీళ్ళు రాకుండా చేసి రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ ప్రభుత్వం.

ఈ ప్రభుత్వం కొత్త ఇండ్లు కట్టివ్వకపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిచ్చే ఇందిరమ్మ ఇండ్లను కూడా రాకుండా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చా ప్రతి పేద కుటుంబానికి రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి 9 రకాల వస్తువులను సంచిలో పెట్టి అమ్మహస్తం పేరుతో అందిస్తాం. డ్వాక్రా సంఘాలకు, ఇందిరా క్రాంతి పథం మహిళలు పావల వడ్డీకి, వడ్డీలేని రుణాలు ఇస్తాం. వంట గ్యాస్ ను రూ. 500 అందిస్తాం. రూ 2 లక్షల రైతుల రుణాలకు ఏకకాలంలో మాఫీ చేస్తాం. రైతుకూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు అందిస్తాం. కేజీ నుంచి పీజీ వరకూ ఇంగ్లీషు మీడియం విద్యను ఉచిత నిర్భంగా అందిస్తాం. రాష్ట్రంలోని 54 శాతం బీసీల కోసం జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ నిధులను కేటాయించేలా బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకువచ్చేలా ఆలోచన చేస్తున్నాం.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.