Site icon NTV Telugu

Bhatti Vikramarka : ఆలేరులో వ్యాపారాలు చేసుకోవాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన పరిస్థితి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

యాదాద్రి జిల్లా అలేరులో నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వందలాది మంది ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందన్నారు. ధనిక రాష్ట్రంలో బడి కట్టలేదు, ప్రాజెక్టు కట్టలేదు, కానీ తెలంగాణ రాష్ట్ర సంపద ఆవిరైందని, రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. ఇల్లు లేని కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలని, నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని, పండించిన పంటకు పెట్టుబాట ధర రావాలని, బీడు భూముల్లో సాగునీరుపారాలని తెలంగాణ తెచ్చుకున్నాం.. కానీ వాస్తవకం వేరుగా ఉందని, పేదవాళ్లు ఇల్లు లేక కనీస వసతులు లేక ఉద్యోగం లేక బాధపడుతుంటే.. పాలకొల్లు మాత్రం అద్భుతంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నారన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వగా ఆ నోటిఫికేషన్ లో ప్రశ్న పత్రాలు లీకేజ్ అవుతుంటే… నిమ్మకు నేర్పినట్లుగా వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు నిరుద్యోగులు భావిస్తున్నారన్నారు.

Also Read : Kishan Reddy : సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ ఉద్దేశం

అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. దుర్మార్గపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ప్రజా క్షేత్రంలో ఓడిస్తాం. ఇందిరామ రాజ్యం తీసుకొస్తాం.. ఆలేరులో వ్యాపారాలు చేసుకోవాలంటే ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే ఆగడాలను కాంగ్రెస్ పార్టీ కట్టడి చేస్తుంది అడ్డుకుంటుంది. ఎక్కడ భూమిని కబ్జా చేయాలి, ఎక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవాలి, ఎవరి దగ్గర కమిషన్లు తీసుకోవాలి, అనే ఆలోచన తప్ప అభివృద్ధి ఆలోచన స్థానిక ఎమ్మెల్యేకు లేదు.’

Also Read : Salman Khan: ఏయ్.. నాకు పెళ్లి వద్దు.. కానీ, పిల్లలు మాత్రం కావాలి.. అది కూడా అలా

Exit mobile version