సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ కార్యక్రమం ఉద్దేశమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలతో కలిసి వీక్షించారు కిషన్ రెడ్డి. దేశంలో లక్షలాది ప్రాంతాల్లో కోట్లాది మంది మన్ కీ బాత్ కార్యక్రమం చూశారన్న కిషన్ రెడ్డి.. సుమారు 100 దేశాల్లోని భారతీయులు సైతం చూశారన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 100 చోట్ల, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 చోట్ల.. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 700కు పైగా ప్రాంతాల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూశారన్నారు కిషన్ రెడ్డి. సామూహికంగా ప్రజలు మన్ కీ బాత్ వీక్షిస్తున్నారు.
Also Read : Mallemala: ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యకు కారణం అదేనా..?
బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఒక పార్టీకి సంబంధించిందో.. రాజకీయ పరమైన కార్యక్రమమో కాదు. సామాజిక సేవ, సమాజంలో మార్పులు, ప్రజలు ఎలా ముందుకు వెళ్తున్నారో ప్రధాని వివరిస్తున్నారు. చిన్న చిన్న ఉదాహరణలతో మోదీ వివరిస్తున్నారు. సమావేశంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎలా సేవ చేయొచ్చో ఇతరులకు మోదీ తెలియజేస్తున్నారు. మన్ కీ బాత్ లో ప్రస్తావన తర్వాత చాలా మంది మరింత పట్టుదలతో పని చేస్తున్నారు. మణిపూర్ లో ఓ అమ్మాయి గురించి ప్రధాని మాట్లాడితే ఆ అమ్మాయి వ్యాపారం పెరిగింది. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. హిమాలయాల్లో కూడా ప్లాస్టిక్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. వాటిని క్లీన్ చేస్తున్న వారి గురించి వివరించారు మోదీ. ఇలా ప్రతీ అంశాన్ని మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ప్రతీ నెలలో చివరి ఆదివారం ఇలా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతున్నారు. ఇలా 100 ఎపిసోడ్ లలో వేలాది మంది జీవితాల గురించి ప్రజలకు మోదీ తెలియజేశారు. దేశంలోని ప్రతీ కుటుంబం మన్ కీ బాత్ ద్వారా దగ్గర అయ్యారు. దేశంలోని కేంద్ర మంత్రుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యే, పారిశ్రామిక వేత్తలు, పొదుపు సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థులు కార్యక్రమాన్ని వీక్షించారు. దేశ ప్రజలు ప్రధానిని ఓ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు.” అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Also Read : Kodali Nani Sensational Comments Live: పవన్ కళ్యాణ్ స్క్రాప్.. కొడాలి నాని కామెంట్స్