NTV Telugu Site icon

Bhatti Vikramarka : అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఒక దఫాలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మోడల్ అంటే మద్యం అమ్మకాలు, అప్పులు తేవడం, ప్రభుత్వ భూములు అమ్మడంలో మొదట ఉందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల సెంటి మెంట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వాటిని విస్మరించిందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వర్షాలకు పంట నష్ట పోతే ఎలాంటి నష్ట పరిహారం లేదని, 2013కు ముందు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లిన వెంటనే ప్రభుత్వం చెల్లించేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒక దఫాలో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read : Minister KTR Investment: హైదరాబాద్ విద్యార్థినిల స్టార్టప్‌కి రూ.8 లక్షల సొంత డబ్బు

ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకునేందుకు జాగ లేని వాళ్ళకు నివేశన స్థలాలు కేటాయిస్తామన్నారు. అదేవిధంగా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందజేస్తామని, భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తామని, కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తామన్నారు. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. గ్యాస్ సిలిండర్ రూ.500 ఆందజేస్తామని, ఇసుక మాఫియాను కట్టడి చేస్తామన్నారు. సహజ వనరులు రాష్ట్ర సంపదకే ఉండేలా చూస్తామని, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరికి మొదటి వారంలో జీతాలు ఇస్తామన్నారు. పల్లె నుండి పట్టణం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్‌ఎస్‌, బిజేపి నిత్యం వార్తల్లో ఉండటం కోసం ఒకర్ని ఒకరు తిట్టుకున్నట్లు నటిస్తారని ఆయన ఆరోపించారు.

Also Read : Karnataka elections: ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి ఫిల్మ్ డైరెక్టర్!