Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka Tributes Suravaram Sudhakar Reddy Political Legacy

Bhatti Vikramarka: సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం!

Published Date :August 24, 2025 , 2:09 pm
By Sampath Kumar
  • సురవరం పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం భట్టి నివాళి
  • సురవరం సేవలను గుర్తు చేసుకున్న డిప్యూటీ సీఎం
  • సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం
Bhatti Vikramarka: సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhatti Vikramarka Pays Tribute to Suravaram Sudhakar Reddy: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన భట్టి.. సుధాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. మనం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం అని అన్నారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారన్నారు. సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ… ‘గొప్ప నాయకుడిని కోల్పోయాం. సురవరం సుధాకర్ రెడ్డికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. విద్యార్థి దశ నుంచి ఆయన పోరాడారు. దేశంలో సీపీఐ బలోపేతం కోసం కృషి చేశారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారు. తను చివరి వరకు ప్రజల కోసం నిలబడ్డారు. వారి రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా ముఖ్యమంత్రి చెప్పినట్టు కేబినెట్లో తీర్మానం చేసి వారు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.

Also Read: KTR: దమ్ముంటే ఆ 10 నియోజకవర్గాల్లో రాజీనామా చేయండి.. కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్!

సురవరం సుధాకర్‌ రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. ‘జాతీయ స్థాయిలో అనేక హోదాల్లో సుధాకర్ రెడ్డి పని చేశారు. ఎన్నో విప్ల ఉద్యమాలు, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. చిరస్మరినియమైన మహనీయుడు సురవరం సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి మరణం ఆవేదనకు గురిచేసింది. విద్యార్ది నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. జాతీయస్థాయిలో ఏడెండ్ల పాటు పని చేశారు.ప్రజల పట్ల.. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. అన్ని ప్రజా సమస్యలపై క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రజా ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బాధాకరం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి మద్దతు తెలిపింది. జాతీయ స్థాయిలో మాతో కలిసి పని చేసే అవకాశం కలిసి పని చేశారు. కేసీఆర్ కూడా సుధాకర్ రెడ్డి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మా పార్టీ తరఫున, కేసీఆర్ తరుపున సురవరం కుటుంబ సభ్యులకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము’ అని కేటీఆర్‌ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • cpi
  • ktr
  • Suravaram Sudhakar Reddy
  • Suravaram Sudhakar Reddy Death

తాజావార్తలు

  • Rashmika: ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’.. అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన క్రేజీ కపుల్!.. రష్మిక పోస్ట్ వైరల్..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • Trump: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Perni Nani: అదే నా ఉద్యోగం, పని.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions