NTV Telugu Site icon

Bhatti Vikramarka : జపాన్‌లో భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటన ప్రారంభం

Bhatti Vikramarka Japan

Bhatti Vikramarka Japan

వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మూడు రోజుల పర్యటనకు జపాన్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు రాష్ట్ర బృందం లో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండి ఎన్ .బలరామ్ ఈ పర్యటన లో పాల్గొంటున్నారు. పర్యావరణహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ సంబంధిత టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాల పరిశీలనకై ఈ బృందం జపాన్ లోని పలు ప్రముఖ పరిశ్రమలను సందర్శించడంతోపాటు వివిధ దిగ్గజ కంపెనీలతో సమావేశాలు నిర్వహించనున్నది. అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆ దేశ ప్రముఖ కంపెనీల, పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు.

  Team India: టీమిండియా రికార్డుల మోత.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో సంచలనం

మూడు రోజుల పర్యటన లో సోమవారం భారత రాయబారి సిబి జార్జి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి కి జపాన్ దేశంలో గల పరిశ్రమలు, తెలంగాణలో పెట్టుబడులకు, భాగస్వామ్య పరిశ్రమలకు గల అవకాశాలపై సంక్షిప్తంగా వివరించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గౌరవార్థం భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఇందులో భట్టి విక్రమార్క ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1వ తేదీ ఉదయం పెట్టుబడులతో వచ్చే కంపెనీల తో రౌండ్ టేబుల్ సమావేశం , వివిధ పారిశ్రామిక వేత్తల తో విడివిడిగా సమావేశాలు, అదే రోజు సాయంత్రం యమాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శన లో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు. 2 వ తేదీన తోషిబా, కవాసాకి ,యాక్లహామ పరిశ్రమలను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఒకాస చేరుకోని 3తేదీన పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్ సందర్శిస్తారు.అనంతరం నాలుగో తేదీన రాష్ట్ర బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది.

  Vehicles Illegal Transportation : వాహనాల అక్రమ రవాణా.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి…