NTV Telugu Site icon

Bhatti Vikramarka : ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, ప్రజలు స్వేచ్ఛగా బతకడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. భయం భయంగా అన్ని వర్గాల ప్రజలు తమ జీవనాన్ని వెళ్లదీస్తున్నారని, అధికారంలో ఉండి ప్రజల అవసరాలను ఆకాంక్షలు నెరవేర్చక పోవడం దురదృష్టకరమన్నారు భట్టి విక్రమార్క. ప్రజల్లో ఉన్నవారికే, సర్వేల ద్వారా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలని ప్రతి నియోజకవర్గంలో నేతలు సిద్ధమవుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు లేవన్నారు.

Also Read : Farmers Protest: హర్యానాలో అన్నదాతల ఆందోళన.. కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధం

అంతేకాకుండా.. ‘ ప్రజల సమస్యల పరిష్కారానికి, ఆకాంక్షలు నెరవేరడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఏకైక మార్గం.. డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడం, ఒక ఇంట్లో ఇద్దరు అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం, రుణమాఫీ చేయడం పెద్ద సమస్య కానే కాదు.. పాలకులకు చేయాలన్న చిత్తశుద్ధి సంకల్పం ఉంటే అన్ని అమలు చేయొచ్చు… బీఆర్ఎస్ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎక్కువైంది. ఆదిలాబాద్ జిల్లా నుండి నల్లగొండ జిల్లా వరకు ఈ సహజ వనరుల దోపిడీ కొనసాగుతుంది. కేసిఆర్ పాలన నిజాం పాలన నాటి దోపిడీని తలపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో కట్టుకొని.. వందల ఎకరాలు ఆక్రమించుకొని… పదవులను, అధికారాన్ని అనుభవిస్తున్నారు. ప్రజల ఆస్తులు పెరగలేదు జీవన ప్రమాణాలు తలసరి ఆదాయం పెరగలేదు కానీ.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగాయి.’ అని ఆయన అన్నారు.

Also Read : Vemulawada Temple : ఆ ప్రచారంలో నిజం లేదంటున్న ఆలయ పూజారులు