Site icon NTV Telugu

Bhatti Vikramarka : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. జనాభా దామాషా పద్ధతిలో బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేస్తాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం రఘునాధపురంలో సీఎల్పీ నేత పార్టీ విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజనాధపురాన్ని మండలంగా ప్రకటిస్తాం.. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ హామీ ఇస్తున్నామని తెలిపారు. భారీ మెజారిటీతో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని, కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీతో స్థానిక చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నూలుపై విధించిన పనులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుందని, ఆలేరు నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు.

Also Read :Virat Kohli Fan : విరాట్ కాళ్లు మొక్కిన అభిమాని.. హగ్ ఇచ్చిన కోహ్లీ

పోటీ పరీక్షల నిర్వహణ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులను ఆదుకుంటుంది…జనాభా దామాషా పద్ధతిలో బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తాం.. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం.. ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది.. బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇస్తాము. నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేంతవరకు నిరుద్యోగ భృతి అందజేస్తాం. దేవాదుల నుండి ఆలేరు నియోజకవర్గానికి గంధముల్ల ద్వారా సాగునీరందిస్తాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకున్నాము అది కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Akhil: పూజతో డేట్… చరణ్ నా హార్ట్ బీట్… పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఏజెంట్

Exit mobile version