NTV Telugu Site icon

Bhatti Vikramarka: సీతారామచంద్ర సన్నిధిలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది..

Bhatti

Bhatti

సీతారామచంద్ర సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు భద్రాచలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయని తెలిపారు. గత పదేళ్ల కాలంలో పేద వాళ్లకు ఇళ్లు ఇచ్చిన పాపం లేదని అన్నారు. పోరాటం చేస్తామనే వారికి సవాల్ చేస్తున్నాం.. విమర్శలు చేసే మీ మెప్పు కోసం ఈ హామీలు ప్రకటించలేదని భట్టి పేర్కొన్నారు.

Read Also: CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం.. రూ.22,500 కోట్లతో శ్రీకారం

తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలని ఆరు గారంటీలు ప్రకటించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రకటించి ఇస్తున్నాము.. మేం తూ తూ మంత్రంగా ప్రకటించడం లేదని పేర్కొ్న్నారు. ఇందిరమ్మ రాజ్యంకు, బీఆర్ఎస్ కు ఉన్న తేడా ఇదేనని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతామని చెప్పారు. గత ప్రభుత్వాలు దోచుకున్నట్లుగా ఉండదని భట్టి విక్రమార్క తెలిపారు.

Read Also: Supreme Court: రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించండి.. ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు

భద్రాచలం పట్టణం కానీ, దేవాలయానికి కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిధులు ఇచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మంచినీళ్లు, గోదావరి బ్రిడ్జి, కట్టిన మరో బ్రిడ్జి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మాత్రమే నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ సందర్భంగా.. ఇందిరమ్మ ఇంటి మోడల్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు అభిషేకించారు.