Bhatti Vikramarka: బొగ్గు గనుల కోసమే అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. తన పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారన్నారు.. ఒక లక్ష్యం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఆస్తులు సంపాదించేందుకు, హోదా అనుభవించేందుకు రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.. ఆస్తులను, వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చేయడమే తన లక్ష్యమన్నారు. తన జీవితం పూర్తి పారదర్శకంగా ఉంటుందని.. ఏ మాత్రం జ్ఞానం లేకుండా మీకు తోచింది రాయడం సరికాదన్నారు..
READ MORE: Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్
టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ.. టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ, మంత్రి కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.. క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులుంటాయి కాబట్టి ఫీల్డ్ విసిట్ పెడతారని చెప్పారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇలాంటి నిబంధనలు పెడతారని.. రాయడం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలని వెల్లడించారు. “టెండర్లు పిలిచింది సింగరేణి బోర్డు.. నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. సైట్ విజిటింగ్ పెట్టారు అన్నావు, సైట్ విజిటింగ్ అనేది కండిషన్లో భాగం.. విజిట్ చేయడం పబ్లిక్ అంశంలో కామన్.. టెండర్లు రద్దు చేయమని సింగరేణి బోర్డును ఆదేశించాను, కొత్త టెండర్లు పిలవమని చెప్పాను.. కట్టు కథలు అల్లి కథనం రాశారు.. రాసిన ఆయనకు ఎవరి మీదో ప్రేమ ఉండొచ్చు.. వైఎస్ మీద కోపంతో నామీద రాసి ఉంటాడు.. నేను, రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్రజలకు నిజాలు తెలియాలి.. వెనకాల ఎవరు ఉండి రాయించారో తర్వాత మాట్లాడతా.” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
READ MORE: CM Chandrababu: పాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్.. ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు..!