Site icon NTV Telugu

Bhatti Vikramarka : రేవంత్‌రెడ్డి సిట్‌ విచారణ.. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని కోరింది సిట్‌. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు రేవంత్‌ రెడ్డి. అయితే.. రేవంత్‌ రెడ్డిని సిట్‌ ప్రశ్నించడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడైనా దర్యాప్తు అధికారులకు సమాచారం కావాలవంటే.. వారి ఇండ్లకు వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారని, ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిని సిట్ కార్యాలయానికి పిలిపించడం అంటే.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, అసలు నేరస్థులకు కాపాడడం కోసం, జనాల్లోకి తప్పుడు సంకేతాలు పంపడం కోసం పిలిపించినట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నాయకులను, వ్యక్తులను భయపెట్టేలా, వారి గొంతు నులిమేలా చేయడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.

Also Read : Maruti Suzuki: మారుతి కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు

తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారని, నియంతృత్వాన్ని ఎదుర్కొనేందుకు సర్వదా సిద్ధంగా ఉంటారన్నారు. సిట్ అధికారుల చట్టబద్దంగా విధులు నిర్వహించాలి కానీ.. ప్రభుత్వానికి తాబేదార్లుగా మారొద్దని సీఎల్పీ నేత హెచ్చరించారన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు ప్రభుత్వం పాల్పడితే.. భారీమూల్యం చెల్లించక తప్పదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యులైన అందరిపైనా చర్యలు తీసుకునే వరకూ పోరాటాలు చేద్దామని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సర్వసాధారణం అని చెప్పిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Also Read : Anushka: పెళ్లి వద్దురా బాబు… మ్యాచో మ్యాన్ దొరకట్లేదు…

Exit mobile version