NTV Telugu Site icon

Bhatti Vikramarka : రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే పంచుతాం

Bhatti

Bhatti

ఖమ్మం కలెక్టరేట్‌లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్‌నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని, ప్రజలు ఇచ్చే ప్రతి సూచన చాలా విలువైనదన్నారు భట్టి. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నిజమైన రైతుకి భరోసా ఉండాలన్నారు. రైతు కానీ వాళ్ళ వద్దని, గతంలో జరిగిన లోపాలు, జరిగిన ఆర్థిక నష్టం పై కూడా ఆలోచించాలన్నారు. రైతులకి ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. రైతు బంధు మీ ఖాతా లో వేశామని, రుణ మాఫీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. న్యాయమైన సహాయం రైతులకు అందివ్వాలి అన్న ఓపెన్ మైండ్ తో ప్రభుత్వం వుందని, బక్క , చిన్న కారు రైతులకి న్యాయం చేయాలి అన్న లక్ష్యం తో వున్నామన్నారు. పేపర్ లో మీడియా లో వచ్చేది ఏది నిజం కాదు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు ఎవ్వరూ అటువంటి వాటిని నమ్మవద్దన్నారు మంత్రి తుమ్మల.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఖర్చు పెట్టే ప్రతి రూపాయ ప్రజలదే అని, గత ప్రభుత్వం ఏ స్కీం ప్రజల అభిప్రాయం స్వీకరించ లేదన్నారు. నాలుగు గోడల మధ్య గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ప్రజల మీద రుద్దారని, ప్రతి పైసా కు అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత మాపై వుందన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు మంత్రి పొంగులేటి. 9 జిల్లాలో రైతు లు ప్రజలు, మెదవుల ఆలోచనలను తీసుకుంటాం రైతులను ఆదుకోవాలని ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేవాళ్లు మాట్లాడుతున్నారని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెడతాం… అది ప్రధాన ప్రతిపక్షం గమనించాలన్నారు మంత్రి పొంగులేటి.