Bhatti Vikramarka : నోటికివచ్చినట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బీఆర్ఎస్ నేతలపై భట్టి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వేర్వేరుగా జరిగిన జూబ్లీహిల్స్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ నాయకుల సమావేశానికి డిప్యూటి సీఎం భట్టి హాజరయ్యారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర సంపదను, వనరులను దోపిడీ చేసిన గత బిఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి నెట్టేసి పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం మోపారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పుట్టబోయే బిడ్డపై కూడా భారం మోపి ఆర్ధికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నోటికి వచ్చినట్టు మాట్లడాటానికి సిగుండాలని ఫైర్ అయ్యారు. పదేళ్ల పరిపాలన లో గత బిఆర్ఎస్ పాలకులు చేసిన దోపిడిని లెక్కలతో సహా బయటపెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో హైదరాబాదులో సృష్టించిన ఆస్తులను గత బిఆర్ఎస్ పాలకులు అమ్ముకొని బతికిరాని, హైదరాబాద్ అభివృద్దికి వారు చేసింది ఏమిలేదని విమర్శించారు. మాట్లడటానికి కూడ హక్కు లేకుండా చేసిన బిఆర్ఎస్ సర్కార్ ను బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న ప్రజల కలలను నిజం చేస్తామన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామని, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో బతకడానికి కావలసిన వాతావరణం కల్పిస్తామన్నారు.
డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిపాలన అందిస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి సంక్షేమమే తప్పా డ్రగ్స్ ఉండదన్న భరోసా హైదరాబాద్ ప్రజలకు కల్పించాలన్నారు. హైదరాబాదు పబ్బుల్లో డ్రగ్స్ విక్రయాలకు చోటు లేదని, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రాంతాలు, మతాల పేరిట విభజన చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల ఉపేక్షించమన్నారు. అనేక మతాలు, కులాల ప్రజలను కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూస్తామన్నారు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజల ధన, మాణ, ప్రాణాలను కాపాడడానికి పోలీస్ వ్యవస్థను పటిష్ట పరిచామన్నారు. పోలీస్, రెవిన్యూ, హెల్త్ ,సివిల్ సప్లై, జిహెచ్ఎంసి అన్ని వ్యవస్థలను ప్రజలకు జవాబుదారీగా పనిచేయిస్తామన్నారు. ఈ వ్యవస్థలు, సంస్థలు నా కోసమే ఏర్పాటు చేశారన్న భావన కల్పించే విధంగా ప్రజా పాలన ఉంటుందన్నారు. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, మూసీ నది ప్రక్షాళన తో పాటు సుందరీకరణ చేసి హైదరాబాద్ ను అందమైన సిటిగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు తయారు చేశామని, ప్రణాళిక బద్దంగా హైదరాబాద్ అభివృద్ది జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?