సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండల కేంద్రంలో సీఎల్పీ పార్టీ విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 9 సంవత్సరాలుగా కృష్ణా జలాలు జిల్లాకు రాకుండా అడ్డుపడింది బీఆర్‌ఎస్ పార్టీనేనని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట ఐదు లక్షల కోట్ల అప్పు తెచ్చారని, కానీ ప్రాజెక్ట్ లు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన అన్నారు. సాగు నీరు ఇవ్వని బీఆర్‌ఎస్ నేతలను పాదయాత్ర ద్వారా నిలదిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : Train Accident: మధ్యప్రదేశ్‌లోని సత్నాలో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. చాకచక్యంగా వ్యవహరించిన లోకో ఫైలట్
మరో నాలుగున్నర ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తా అనే కేసీఆర్ మాటలను జనం నమ్మే స్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పార్టీని శంకరగిరి మాన్యాలకో, బంగాళాఖాతంలో పడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భట్టి విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పేరుతో ప్రజల హక్కులను హరిస్తున్నప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లకూడదో కేసీఆర్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్ నుండి నల్లగొండ వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో స్పష్టత ఉందని, అభద్రతతోనే మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం అని కేసీఆర్ సభల్లో చెప్తున్నారని భట్టి అన్నారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణ వాటా 9 ఏళ్లలో ఎందుకు తేల్చలేదన్న భట్టి.. ఎక్కడ, ఎందుకు లాలూచీ పడ్డారో కేసీఆర్ చెప్పాలన్నారు.
Also Read : Nagarjuna Akkineni: డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చిన నాగార్జున?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇస్తామని.. రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామన్న ఆయన.. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని పేదలను గుర్తించి వారికి స్థలాలు కొనుగోలు చేసి ప్లాట్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.