సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ధరణి మాఫియాకు సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అని ఆయన ఆరోపించారు. సోమేశ్ కుమార్ ను ఏపీకి పంపిస్తే చేతగాక తెలంగాణకి వచ్చిన సోమేశ్ కుమార్ కేసిఆర్ స్పెషల్ అడ్వైజర్ గా పెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. ఆస్తులు అమ్ముకుని ప్రజా సేవ చేసిన ఘనత కాంగ్రెస్ నేతలదని ఆయన అన్నారు.
Also Read : AP CM Jagan Tour: ఈ నెల 28న కురుపాం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన
10 ఏళ్ళలోనే కోట్ల రూపాయలను వెనకేసుకొన్న ఘనత బీఆర్‌ఎస్ నేతలదని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలో పారుతున్న సాగునీటికి ఆనాడు కాంగ్రెస్ హయాంలో వేసిన పునాదులే కారణమన్నారు. కాంగ్రెస్ తీసిన కాలువల్లో నీరు పారుతుంటే దండం పెట్టలసింది కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతలకు అని, ప్రజలకు సంపద చేరకపోగా బీఆర్‌ఎస్ నేతల ఆస్తులు పెరిగాయన్నారు. అంతేకాకుండా.. ‘పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ నల్లగొండ జిల్లా…. ఊరూర బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీని. 10ఏళ్ళైనా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు. ఆనాటి కాంగ్రెస్ నేతల బురదపై జల్లుతూ పబ్బం గడుపుతుంది బీఆర్‌ఎస్ పార్టీ. ధరణి పేరుతో లాండ్ మాఫియా నడుస్తుంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తి.’ అని భట్టి వ్యాఖ్యానించారు.