NTV Telugu Site icon

Bhatti Vikramarka: కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి

Batti

Batti

తెలంగాణలో కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు గాంధీభవన్ ప్రకాశం హాల్ లో జరిగిన అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశంలో భట్టి విక్రమార్క, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కార్మికుల సంక్షేమం కోసమని కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం.. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మినిమం వేజెస్ బోర్డ్ సమీక్ష చేయకుండా నిర్లక్ష్యము చేస్తున్నదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇలా సమీక్షలు జరపకుండా, కనీస‌ వేతనం అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.

Urination Incident: ఫ్లైట్ ఫ్లోర్‌లో మహిళ మూత్ర విసర్జన.. ఎయిర్‌లైన్ సిబ్బంది వల్లేనట..!

కార్మికులకు సంబంధించిన రూ. 10వేల కోట్ల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మిక లోకం బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిపిఎల్ కింద ఉన్న 54 లక్షల కుటుంబాలకు.. వంద రోజుల పాటు పని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉపాధి హామీ చట్టం నిధులను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. 2023- 24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Vakkantham Vamsi : ఆ ముగ్గురు స్టార్ హీరోల వల్ల నా జీవితం మారిపోయింది..

రాష్ట్రంలోని ఫ్యూడలిస్టుల ప్రభుత్వం, దేశంలోని క్యాపిటలిస్టుల ప్రభుత్వం చేసే కుటిల, కుట్రల్లో కార్మికులు పడొద్దని భట్టి విక్రమార్క సూచించారు. తాడీతులు, పీడితులు బాధితులు, బలహీన వర్గాలు ఉన్న అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తామని తెలిపారు. దేశంలో కార్మిక చట్టాలు తీసుకువచ్చిన మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ అని అన్నారు. బ్రిటిష్ పాలనల్లో పోరాడి కార్మిక చట్టాలు తెచ్చిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. శ్రమ దోపిడీ లేకుండా ఎనిమిది గంటల పని విధానం, మహిళలకు ప్రసూతి సెలవులు, అనేక కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ కే దక్కుతుందని భట్టి విక్కమార్క అన్నారు.