ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం లోని ధనియాల గూడెం వద్ద భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పారని, అవకతవకల కాళేశ్వరం గురించి ముందే చెప్పానని ఆయన వెల్లడించారు. డిజైన్ బాగా లేదని చెప్పామని ఆయన అన్నారు. కేసీఆర్ ఇంజనీరింగ్ అధికారి గా స్వంతంగా డిజైన్ చేసి కావాల్సిన కాంట్రాక్టర్ లను పిలిపించి కుని రెడిజైనింగ్ చేసిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. ‘మేడిగడ్డ ప్రాజెక్ట్ దెబ్బతిన్నది. ప్రజలకు ఏమి తెలియకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు. మీడియాను వెళ్లనివ్వడం లేదు వాస్తవాలు రానివ్వడం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన రిపోర్ట్ లో డాం కు జరిగిన నష్టం చూపించింది. బ్యారేజికి చెందిన ఎటువంటి సమాచారం కేంద్రానికి డ్యాం అథారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా మేము ఆరోపణలు చేయడం లేదు. వాస్తవాలను కేంద్రం లోని డ్యాం సేఫ్టీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ప్లానింగ్‌కు అనుగుణంగా నిర్మాణం జరుగలేదు. డిజైన్ చేసినట్లుగా ప్లానింగ్ జరుగలేదు. మొత్తం బ్యారేజి ప్రమాదంలో పడనుంది. బ్యారేజి లో నీళ్ళు నింపితే ప్రమాదకరం. మేడిగడ్డ, సుందిల్లలు కూడా ప్రమాదం లో వున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది… కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కేంద్ర పర్యవేక్షణ వైఫల్యం దర్యాప్తు సంస్థలు విచారణ చేయక పోతే కేంద్రం రాష్ట్ర కలసి పోయినట్లుగా భావించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండు కలసి దోచుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అందరూ చూడడానికి అనుమతి ఇవ్వాలి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే. డ్యాం ఎల్‌అండ్‌టీ సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది… సెంట్రల్ విజిలెన్స్ కూడా బాధ్యత వహించాలి విచారణ చేయాలి. కాంగ్రెస్ చెప్పిన ప్రతి దానిని రాజకీయం అంటున్నారు కానీ నేషనల్ డాం సెక్యూరిటీ ఇప్పుడు చెబుతుంది. దోపిడీ తోనే పని చేసుకుందామని బీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నివేదిక కాళేశ్వరం డామేజ్ ఇవ్వలేదు.’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.