NTV Telugu Site icon

Bhatti Vikramarka : చరిత్ర తెలియని వాళ్ళు పాలన చేస్తున్నారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

ఖమ్మం వి.ఎం‌.బంజర్ రింగ్ సెంటర్ ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర ముగింపు సభలో లో సీఎల్పీ‌నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ‌ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోట.. 75 సంవత్సరాల క్రితం మన దేశం కోసం పోరాటం చేసిన అనేక ప్రాణాలు అర్పించి,త్యాగాలు చేసి జైల్ పాలైనారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనుబాహులకి గౌరవం ఇవ్వటానికే సోనియా గాంధీ‌పిలుపు‌మేరకు ఆజాదికా యాత్ర… మోడీ గాంధీని జవహర్ లాల్ నెహ్రూ ని ఇతరత్ర నాయకులను అవమానం పరుస్తున్నాడు… నీకు తెలియకుండానే నీ మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారా…మోడీ అని ప్రశ్నించారు భట్టి. చరిత్ర తెలియని వాళ్ళు పాలన చేస్తున్నారు. నియంతలాగా పాలన చేసిన ఘనత బీజేపీది.

 

అలాంటి‌పాలన జవహర్ లాల్ నెహ్రూ చేయలేదు లౌకికవాదంతో ముందుకు తీసుకువెళ్ళారు.. ప్రాణాలు అర్పించి అయిన దేశాని కాపాడుకుంటాం అని ఇందరగాంధీ..రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ లో బాహుళర్దక ప్రాజెక్టు లు కట్టారు కాబట్టే దేశం ఈ మాత్రం ఉంది… బీజేపీ పార్టీ ఏం చేసింది… ఏం చెయ్యలేదు.. చెయ్యకుండానే మసిపూసి మాయ చేస్తున్నారు.. దేశం చాలా ప్రమాదంలో ఉంది. లౌకిక వాదం,ప్రజాస్వామ్యమే దేశానికి శ్రీరామ రక్షణ. దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని భట్టి వ్యాఖ్యానించారు.