NTV Telugu Site icon

Bhatti Vikramarka : దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పరిపాలన

Bhatti

Bhatti

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పేదలకు పంపిణీ చేసిన అసైన్మెంట్ భూములను తిరిగి తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దుర్మార్గమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ‘ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, బిజెపి పదవులు దళితులకు ఇవ్వకుండా తిరస్కరించినది వాస్తవం కాదా? దళితులకు మంత్రి మండలిలో సరైన స్థానం ఇవ్వకుండా అవమానించినది వాస్తవం కాదా? సింగరేణి ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు తుంగలో తొక్కుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం. రిజర్వేషన్లను నేరుగా తొలగిస్తే ప్రభుత్వం పై తిరుగుబాటు ఎదురవుతుందని ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్న కేసీఆర్. రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం. దళిత గిరిజన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి ముందుకు రాని ప్రభుత్వం. క్యాపిటల్ లిస్టులకు రియల్ ఎస్టేట్ సంస్థలకు కోట్లాది విలువైన భూములు కట్టబెడుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దళిత బంధు కేటాయించిన రూ. 17,500 కోట్లు ఏడాది పూర్తి అయిన విడుదల చేయకపోవడం. ఇంతకంటే దుర్మార్గం లేదు. కేసీఆర్‌ ఎన్నికల జిమ్మికులకు తెలంగాణ సమాజం మోసపోవడానికి సిద్ధంగా లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పరిపాలన. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే తెలంగాణ దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. భూసంస్కరణలు, 20 సూత్రాల అమలు, ఇందిరా జలప్రభ, ఐటీడీఏల ద్వారా దళిత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, సంక్షేమ పథకాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ జీవితాల్లో వెలుగులు నింపాయి.

Also Read :GT vs PBKS: లక్ష్యంవైపు దూసుకెళ్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంతృత్వ పరిపాలనలో బిజెపి నాయకత్వంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పై అనార్హత వేటు వేసి దేశ ప్రజాస్వామ్యానికి సవాల్ గా మారిన మోడీ, అమిత్ షా లు. రాజ్యాంగబద్ధంగా గుర్తించిన ప్రతిపక్షం ఉంటేనే నిజమైన ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీకి భావ స్వేచ్ఛ గురించి తెలుసు. మోడీ అమిత్ షా మాదిరిగా కాంగ్రెస్ ప్రవర్తించి ఉంటే ఇప్పుడు దేశంలో బిజెపి ఉండేదే కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతర పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా అంబేద్కర్ జయంతి రోజున శుక్రవారం మంచిర్యాలలో జై భారత్ సత్యాగ్రహ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేతలు, పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మాజీ కేంద్ర మంత్రులు మాజీ రాష్ట్ర మంత్రులు పీసీసీ కార్యవర్గం మొత్తం ఈ సభకు వస్తున్నారు. ఈ సభ విజయవంతం చేయడానికి ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి’ చేశారు భట్టి విక్రమార్క

Also Read : MVV Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు

Show comments