Site icon NTV Telugu

Bhatti Vikramarka :ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, పెండింగ్ నిధులను వెంటనే విడదల చేయాలని కోరామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ రుణాలు పెను భారంగా మారాయని, గత ప్రభత్వం 31, 795 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుందన్నారు భట్టి. 10.75 శాతం, 11.25 శాతం వడ్డీ రేటు తో రుణాలు తీసుకుందని, రుణాలు “రీస్ట్రక్చర్” చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే, పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఆయన తెలిపారు.

 
CP Srinivas Reddy: గుజరాత్‌లో 10 రోజుల పాటు ఆపరేషన్‌.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్
 

అయితే.. హైదరాబాద్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. హైదరాబాద్ అంటేనే చెరువులు, కుంటలు, రాళ్ళు గుట్టలు అని, అలాంటి నగరంలో ని చెరువులను ఆక్రమించి ఇళ్ళను కట్టారన్నారు. ప్రభత్వం సాధారణంగా సంబంధితులకు నోటీసులు ఇచ్చే అక్రమ నిర్మాణాలను కూల్చడం జరుగుతుందన్నారు. ఇలాంటి అక్రమాల కూల్చివేత కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. శాటిలైట్ చిత్రాల ద్వారా గతంలో ఉన్న చెరువుల వివరాలు, జరిగిన అక్రమణలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజలే దీనిపై ఆలోచించాలన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ బఫర్‌జోన్‌లో కాదు చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని ఆయన అన్నారు.

Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?

Exit mobile version