NTV Telugu Site icon

Bhatti Vikramarka: మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్‌ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది అని ఆయన అన్నారు. ఇంత వరకు పరిశ్రమల పాలసీనే ఉండేదని.. కానీ ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ పాలసీ కూడా మనం తెచ్చుకున్నామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Jagdaur CHC: పేషేంట్ నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు చేశాడు.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు!

రాహుల్ గాంధీ గతంలో MSME పారిశ్రామిక వేత్తలతో చర్చించారని, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా సీఎం రేవంత్ కొత్త పాలసీ తెచ్చారన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలను సీఎం రేవంత్‌ రెడ్డి ఇక్కడికి తీసుకు వస్తున్నారని, MSMCల సంగతి ఏంటీ అనుకున్నా… కానీ రాయితీలు.. భూ కేటాయింపు… మహిళా కోటా పెట్టి.. MSMEపై పాలసీనే తెచ్చారు అంటే సీఎం ఎంత దృష్టి సారించారో అన్నది అర్థమైందన్నారు భట్టి విక్రమార్క. పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు.. సీఎం కృషిని అభిన్నదిస్తున్నానని భట్టి అన్నారు. గత ప్రభుత్వం రాయితీలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పారని, కానీ పైసా ఇవ్వలేదన్నారు.

Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్