NTV Telugu Site icon

Bhatti Vikramarka : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నాం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో మంచి వాతావరణం తెస్తామని, మూడోతరగతి వరకు అదే గ్రామంలో పాఠశాల ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. అంగన్ వాడి అయాలతోపాటు విద్యాబోధన కోసం ప్రత్యేక టీచర్లు అని, ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్‌ స్కూల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్సిల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. 4 వ తరగతి నుంచి రెసిడెన్సియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క.

Brain eating amoeba: అద్భుతం.. “మెదుడుని తినే అమిబా”ని జయించిన 14 ఏళ్ల బాలుడు

10 వ తరగతి వరకు పూర్తి ఉచిత విద్య అందిస్తామని ఆయన తెలిపారు. రాత్రి కి అక్కడ ఉండలేని పిల్లలను ఇళ్లకు పంపేందుకు సౌకర్యాలు ఉంటాయని, వాహనాల ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం ఉంటుందని, ఒక్కో పాఠశాలకు రూ 80 to 100 కోట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒక్కో పాఠశాలకు భూమి అందుబాటును బట్టి 25 ఎకరాల వరకు ఉంటుందని, బాసర ఐఐఐటీ లో మాదక ద్రవ్యాలు దొరకడం దురదృష్టకరమన్నారు. దానిపైన విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యులు ఎవరూ గీత దాటరు.. నేను తప్పు చేసినా వదలొద్దు..