బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎపుడు బయట పడాలి అని చాలా మంది నాయకులు అనుకుంటున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అందుకే కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయని, షర్మిల చేరిక అంశం నా దృష్టిలో లేదు ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలను కలుస్తున్నట్లు, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియామకాలు ఏదీ నెరవేరలేదని, నా పాదయాత్రలో ప్రజల సమస్యలు ఎన్నో కళ్ళారా చూశానన్నారు భట్టి విక్రమార్క. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అవేవీ కనిపించడం లేదని, రూ. 5 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రమన్నారు భట్టి విక్రమార్క. వరదలు, విపత్తుల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగం స్తబ్దుగా ఉండిపోయిందని, యంత్రాంగాన్ని తమ ప్రైవేట్ ఉద్యోగులుగా మార్చడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు భట్టి విక్రమార్క.
Also Read : Crocodile Attack: అదృష్టం అంటే ఈమెదే.. మొసలి నోటికి చిక్కి, గంట తర్వాత బతికి బయటపడింది
అశాస్త్రీయంగా ప్రాజెక్టులు కడుతున్నారు. కాళేశ్వరం అలాగే కట్టారు. సీతారామ సాగర్ అలాగే కడుతున్నారని, ఈ కారణంగా నీరు రాకపోగా, వరదలు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఇంజనీర్లు రూపొందించాలి కానీ ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడం వల్ల ఈ పరిస్థితి అని, కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని, ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక మా దగ్గరకు వస్తున్నారన్నారు. మా పార్టీ వ్యక్తుల మీద కాదు, సిద్ధాంతం మీద నడుస్తోందని, శాస్త్రీయంగా సర్వేలు చేసి, అభ్యర్థుల విజయావకాశాలను అంచనా వేసి అధిష్టానం టికెట్స్ ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు. ముందే హామీలు ఇవ్వడం అనేది ఉండదని, షర్మిల చేరిక మీద వార్తలు నేనూ చూశాను. అంతకు మించి సమాచారం లేదు. అధిష్టానం చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Also Read : Crocodile Attack: అదృష్టం అంటే ఈమెదే.. మొసలి నోటికి చిక్కి, గంట తర్వాత బతికి బయటపడింది
