సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ఇవాళ చందనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భట్టి పాదయాత్రలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మాణిక్ రావ్ థాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గమ్యం, గమనం లేని పొద్దుతిరుగుడు పువ్వు గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ విమర్శించారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అధికారం చుట్టు తిరిగే వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి అని ఆయన అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తున్న నాకు గమ్యం, గమనం ఉంది.
Also Read : Love jihad case: హిందువులుగా పేర్లు మార్చుని ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ.. ఆన్‌లైన్ పేమెంట్‌తో కుట్ర బట్టబయలు..
భగ భగ మండుతున్న ఎండలు, గాలి వానలతో టెంట్లు కూలిన, అకాల వర్షంలో తడుస్తూ నడిచానే తప్ప పాదయాత్ర ఎక్కడ ఆపలేదని, బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మీడియా సాక్షిగా దేశానికి చూపించామన్నారు. 42 వేల కోట్ల నిధులతో ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ నీళ్ళు నేను పాదయాత్ర చేసిన గ్రామాల్లో 90% కనిపించలేదు. ఖాళీ గా ఉన్న పైపులు, కట్టిన ట్యాంకులను ప్రజలు చూయించారని, నీళ్ల పండుగ పేరుతో జలాల్లో పసుపు, కుంకుమ వదులుతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు ఎస్ ఎల్ బి సి టన్నెల్, నక్కలగండి పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ను వదిలించుకోకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం లక్ష్యాలు నెరవేరకపోవడంతో పాటు తెలంగాణలో బతికే స్వేచ్ఛ లేకుండా పోతుందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Also Read : Viral Video : ఇదేందీ తల్లి.. ఆఖరికి మెట్రోను కూడా వదలరా.. దేవుడా..