Site icon NTV Telugu

Bhatti Vikramarka : సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికం

Bhatti

Bhatti

నిన్న రాత్రి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడిపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ లేకుండా ఎలా తనిఖీలు చేపడుతారని కాంగ్రెస్‌ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే.. ఈదాడిలో పోలీసులు ఓ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ దాడిని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు కమాండ్‌ కంట్రోల్‌ రూం ముట్టడికి యత్నించడంతో పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. దీనిపై తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండించారు. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు భట్టి. భారత రాజ్యంగం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచనలను, భావాలను వ్యాప్తి చేసుకోవడానికి హక్కు కల్పించిందని, తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజాస్వామికంగా ఏర్పాటు అయ్యిందన్నారు భట్టి.
Also Read : Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినండి..!

తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనని ఆయన వ్యా్ఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారి విధానాలను వారు చెప్పుకుంటూనే ఇతర పార్టీల భావాలను వ్యాప్తి చేసుకోవడానికి ఉన్న వ్యవస్థలను వాడుకోనివ్వాలని ఆయన వెల్లడించారు. బహిరంగ సమావేశాలు కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఏ వ్యవస్థనైన స్వేచ్ఛగా వాడుకోనివ్వాలని ఆయన అన్నారు. ఈ వ్యవస్థలను కట్టడి చేయాలనుకోవడం భారత రాజ్యంగం కల్పించిన స్వేచ్ఛను కట్టడి చేసినట్టేనని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరెస్ట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సునీల్ కనుగోలు కార్యాలయం యధావిధిగా నడుపుకోవడానికి ఏలాంటి ఆటంకం కల్గించకూడదని ఆయన అన్నారు.

Exit mobile version