Site icon NTV Telugu

Bharti Airtel MD Salary: కంపెనీ చైర్మన్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఉద్యోగులు.. ఎన్ని కోట్లో తెలుసా?

Sunil Mittal

Sunil Mittal

Bharti Airtel MD Salary: భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటి. ఎయిర్‌టెల్ దశాబ్దాలుగా దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. ప్రస్తుతం కంపెనీ వ్యాపారం భారత్‌తో పాటు అనేక ఇతర దేశాలలో నడుస్తోంది. సాంప్రదాయ టెలికాం సేవలతో పాటు భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఇంత పెద్ద కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కోట్లలో జీతం పొందడం సహజం. కానీ భారతీ ఎయిర్‌టెల్‌లో ఛైర్మన్ కంటే ఎక్కువ జీతం పొందే వ్యక్తులు ఉన్నారు.. ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం. చైర్మన్ కంటే కొన్ని కోట్ల రూపాయల జీతం వారికే ఎక్కువ.

చైర్మన్ కంటే జీతం ఎక్కువ
సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతం గురించి కంపెనీ వార్షిక నివేదికలో సమాచారం ఇచ్చింది. నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ మొత్తం వార్షిక వేతనం రూ. 16.77 కోట్లు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ జీతం అతని కంటే ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో విట్టల్ మొత్తం వేతనం రూ.16.84 కోట్లుగా ఉంది.

Read Also:Married Woman: భర్తతో విడాకులు.. మరొకరితో సహజీవనం.. ఇంతలో ఊహించని ట్విస్ట్

2022-23లో వచ్చిన తేడా
ఇందుకు కారణం కూడా నివేదికలో వెల్లడైంది. నిజానికి చైర్మన్ మిట్టల్ జీతం, అలవెన్సులలో మార్పు లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అతను పొందుతున్న జీతం, అలవెన్సుల మొత్తం.. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తాను పొందుతున్న మొత్తంలో పెద్ద స్థాయిలో తేడా లేదు. గత ఆర్థిక సంవత్సరంలో మిట్టల్ వార్షిక వేతనం, అలవెన్సులు రూ.10.06 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, విట్టల్ విషయానికి వస్తే వార్షిక పెరుగుదల 10.4 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.10.09 కోట్లకు చేరుకుంది.

ఏడాది క్రితం కాస్త తేడా
అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిట్టల్ మొత్తం వార్షిక వేతనం ఎండీ విట్టల్ కంటే ఎక్కువగా ఉంది. అయితే ఇద్దరి మొత్తం వేతనంలో పెద్దగా తేడా లేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిట్టల్ మొత్తం రెమ్యునరేషన్ రూ. 15.39 కోట్లు కాగా కంపెనీ నుంచి విట్టల్ మొత్తం రూ.15.25 కోట్లు అందుకున్నారు. ఆ తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో విట్టల్ వార్షిక జీతం, అలవెన్సులు పెరిగిన వెంటనే అతని మొత్తం వేతనం చైర్మన్ మిట్టల్ కంటే మించిపోయింది.

Read Also:Prabhas: ఆ ప్రాజెక్ట్ కి వాయించేదెవరో?

గత ఆర్థిక సంవత్సరంలో విట్టల్ మొత్తం వేతనం రూ. 16.84 కోట్లలో రూ. 10.09 కోట్ల జీతం, అలవెన్సులు, కొన్ని ఇతరాలు ఉన్నట్లు కంపెనీ నివేదికలో పేర్కొంది. అతను రూ. 6.74 కోట్ల పనితీరు ఆధారిత ప్రోత్సాహకాన్ని పొందాడు. ఇది కాకుండా విట్టల్‌కు కొన్ని అదనపు సౌకర్యాలు కూడా లభించాయి. మిట్టల్ రూ. 16.77 కోట్ల వేతనంలో రూ. 10.06 కోట్ల జీతం-అలవెన్స్, రూ. 4.5 కోట్ల పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్, రూ. 2.2 కోట్ల అదనపు సౌకర్యాలు ఉన్నాయి.

Exit mobile version