మాస్ మహారాజా రవితేజ తన మార్కు కామెడీతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 13, 2026న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కామెడీని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు భామల మధ్య రవితేజ పడే పాట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక తాజాగా
Also Read :Venu Swamy – Shivaji: నన్ను అయితే బతకనిచ్చేవాళ్లే కాదు.. శివాజీ కామెంట్స్‌పై వేణు స్వామి రియాక్షన్
ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను దక్కించుకుంది. కాగా ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రన్‌టైమ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రవితేజ కెరీర్‌లో మరో హిలేరియస్ ఎంటర్టైనర్ పక్కా అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
