NTV Telugu Site icon

Bharateeyudu 2: భాగ్యనగరంలో ‘భారతీయుడు 2’ సందడి.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్

Bharateeyudu 2

Bharateeyudu 2

Bharateeyudu 2: యూనివర్సల్ స్టార్‌ కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ శంక‌ర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ఇంకా ఎక్కువ సమయం లేకపోవడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. జులై 7న భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. జులై 7న సాయంత్రం 6 గంటల నుంచి ఎన్ క‌న్వెన్షన్‌లో భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది.

Read Also: Nag Ashwin: కల్కిగా నటించబోయేది ఎవరంటే.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్

అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పీ, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థలు ద‌క్కించుకున్నాయి. 28 ఏళ్ల ముందు గతంలో కమల్, శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్‌ బస్టర్ మూవీ భారతీయుడు చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ర‌వివ‌ర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తు్న్నారు.

‘భారతీయుడు 2’ సినిమా ప్రపంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్షన్స్ అధినేత సుభాస్కర‌న్ జులై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Show comments