Nag Aswin Comments on Casting Kalki Role: డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలు పంచుకున్నారు. మీడియా ఇంటరాక్షన్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…అందరూ మూవీ చూసినందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్ తరపున థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఒక డోర్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి కల్కి రిఫరెన్స్ పాయింట్ లా ఉంటుంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు. కల్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని చెబుతున్నారు.
Kalki 2898 AD: ‘కల్కి’లో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!
థియేటర్స్ లోకి వెళ్లి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని పొందడం సినిమా ముఖ్య ఉద్దేశం. ఇలాంటి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అందించినందుకు ఆనందంగా వుంది. అందరికీ థాంక్ యూ’ అన్నారు. ఈ క్రమంలోనే కల్కిగా ఏ హీరో రాబోతున్నారు ? మహాభారతంలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏమిటి ? -ఇంకా పొట్టలోనే వున్నారు కదా, ఇంకా దానికి సమయం ఉంది అని పేర్కొన్న నాగ్ అశ్విన్ నా ఫేవరేట్ కర్ణుడు అని అన్నారు. ఈ సినిమాలో ప్రయాణంలో మీకు ఛాలెంజ్ గా అనిపించిన అంశం ఏమిటి ? అని అడిగితే ఒక సినిమాని నాలుగున్నరేళ్లు దాకా పట్టుకొని ఉండాలంటే జడ్జిమెంట్ ఉండాలి, 2019లో రాసిన సీన్ 2024 లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జిమెంట్ పెట్టుకోవడం కష్టమైన విషయం. దీనికి డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఈ సినిమా విషయంలో అదే కష్టమనిపించింది అని అన్నారు.