Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Summit 2026: హైదరాబాద్ నగరంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమ్మిట్-2026’కు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విద్వేష రాజకీయాలు, సామాజిక విభజన పెరుగుతున్న తరుణంలో ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల భావాలు కలిగిన వారిని ఒకే వేదికపైకి తెచ్చి నూతన దిశానిర్దేశం చేయడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమానికి 70కి పైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, మేధావులు హాజరుకానున్నారు.
మహాత్మా గాంధీ బోధించిన అహింసా మార్గం, నెహ్రూ ప్రవచించిన అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక విధానాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సు సాగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు శత్రువులు కాదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ ప్రతిపక్షాల గొంతుకను పరిరక్షించడమే అసలైన ప్రజాస్వామ్య సూత్రమని పేర్కొంటూ, అన్ని పార్టీల నాయకులను ఈ చర్చకు ఆహ్వానించారు. ఆర్థిక విధానాలకు దావోస్ వేదికైనట్లే, సామాజిక-రాజకీయ చర్చలకు హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా మారనుందని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం, నెహ్రూ జయంతి వేళ జరుగుతున్న ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి మీడియా విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
Also Read
- Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ "ఎగ్ లబాబ్దార్" సులువుగా చేసుకోండి ఇలా..!
- Hyderabad: అమ్మాయిల ప్రాణాలతో చెలగాటం.. ఐవీఎఫ్ మాఫియా గుట్టు రట్టు
- How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
- Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
తాజావార్తలు
-
Bharat Summit 2026: హైదరాబాద్ వేదికగా ‘భారత్ సమ్మిట్-2026’.. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Hyderabad: అమ్మాయిల ప్రాణాలతో చెలగాటం.. ఐవీఎఫ్ మాఫియా గుట్టు రట్టు
-
Grandfather’s Property: తాత నుంచి తండ్రికి వచ్చిన ఆస్తిపై.. మనవడికి హక్కు ఉంటుందా?.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’