Site icon NTV Telugu

Koti Deepotsavam 2025: ఆధ్యాత్మిక మహాసమ్మేళనం.. నవంబర్ 1 నుంచి భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025: భారతీయ ఆధ్యాత్మికతకు, సనాతన ధర్మానికి నెలవైన తెలుగు గడ్డపై భక్తి టీవీ ప్రతి సంవత్సరం నిర్వహించే అద్భుతమైన కార్యక్రమం ‘కోటి దీపోత్సవం’. ఈ దివ్యమైన కార్యక్రమం ఈ సంవత్సరం కూడా భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ముంచెత్తడానికి రెడీ అయింది. శివపార్వతుల అనుగ్రహం కోసం, భక్తులు కోటి దీపాల కాంతులలో ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది.

7000mah బ్యాటరీ, 50MP కెమెరా, IP64 రేటింగ్తో బడ్జెట్ రేంజ్లో రాబోతున్న Moto G06 4G స్మార్ట్ఫోన్

ఇకపోతే, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 1వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఒకే చోట చేరి, కోటి దీపాల వెలుగులో శివుడిని ఆరాధించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ మహా వేడుక కార్తీక మాసంలోని పవిత్ర దినాలలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం కార్తీక మాసంలో భక్తులకు శివుడిని మరింత దగ్గర చేయనుంది.

Flood Alert: వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. హైదరాబాదుకు పొంచి ఉన్న ప్రమాదం?

ఈ అపురూపమైన భక్తి పండుగకు వేదికగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సిద్ధమవుతుంది. విశాలమైన ఈ ప్రాంగణంలో భక్తులందరూ సౌకర్యవంతంగా కూర్చుని, సాయంకాలం జరిగే పూజలు, దివ్య దర్శనాలు, ప్రవచనాలు, కోటి దీపాల వెలుగులను తిలకించే అవకాశం భక్తులు పొందనున్నారు. కోటి దీపోత్సవం కేవలం దీపాలు వెలిగించే కార్యక్రమం కాదు.. ఇది భక్తి, సంస్కృతిల కలయిక. ఈ వేదికపై ప్రతిరోజూ ప్రముఖ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొని ప్రవచనాలు అందిస్తారు.

భక్తిటీవీ కోటి దీపోత్సవం- 2025🙏🕉️
Bhakthi TV Koti Deepotsavam 2025 begins on 1st November!

🗓️: 1st November onwards
Venue:📍NTR stadium, Hyderabad

Exit mobile version