Moto G06 4G: మోటరోలా తన కొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ ‘మోటో G06 పవర్’ (moto g06 power) ను అక్టోబర్ 7న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ తన విభాగంలోనే మొట్టమొదటిసారిగా 7000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో రావడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పెర్ఫార్మన్స్, స్ట్రీమింగ్, స్క్రోలింగ్ కోసం మంచి ఎంపిక అని టీజర్లలో కంపెనీ పేర్కొంది పేర్కొంది. ఇది రాబోయే ఫోన్‌పై అంచనాలను పెంచింది.
Red Alert for Uttar Andhra: ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దబిడిదిబిడే
ఈ మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది శక్తివంతమైన MediaTek Helio G81 Extreme ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15తో రానున్న ఈ ఫోన్‌లో 50MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో దుమ్ము మరియు నీటి తుంపరల నుండి రక్షణ కలిగి ఉంటుంది. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
Kantara : కాంతార లో రిషబ్ శెట్టి భార్య నటించింది.. సీన్ ఏంటో కనిపెట్టారా?
ఇక దీనిలోని 7000mAh బ్యాటరీ రెండున్నర రోజులకు పైగా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని, 1000 ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా 80% కంటే ఎక్కువ బ్యాటరీ నిలబెట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. PANTONE లారెల్ ఓక్, టేపెస్ట్రీ, టెండ్రిల్ అనే ఆకర్షణీయమైన రంగుల్లో రానున్న ఈ మోటో G06 పవర్ 4GB + 64GB మోడల్ ధర సుమారు రూ. 8000 ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Say hello to the all new -moto g06 POWER
Its massive 7000mAh battery keeps you going for up to 65 hours on a single charge—up to 3 days of entertainment, calls, and endless scrolling without reaching for a charger.
Stay tuned for more!
— Motorola India (@motorolaindia) October 3, 2025