
వైకుంఠ చతుర్దశి వేళ గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం అయిన భక్తి టీవీ కోటి దీపోత్సవం ఏడవరోజుకి చేరింది. తిరుమల వేంకటేశ్వరుని కల్యాణం కనుల పండువగా సాగింది. ఏడోరోజు కార్యక్రమాలు వైభవంగా సాగాయి. నేత్రపర్వంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం సాగింది. భారతీయ సంప్రదాయం విశిష్టత.. లోకా సమస్త సుఖినోభవంతు. ఈ భూలోకం అంతా ఒకటే కుటుంబం. వసుధైక కుటుంబం. అంతా పరమాత్ముడి సంతానం. ప్రీతితో దీవించాలి. ద్వేషంతో వుండకూడదు. శాస్త్ర సమ్మతంగా జీవించాలి. కార్తిక మాసంలో ఆ పరమశివుని కీర్తించినా, ధ్యానించినా, అభిషేకించినా సకల శభాలు కలుగుతాయి.
ఏడవ రోజు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. భక్తి టీవీ కోటిదీపోత్సవం విశిష్టతను వారు కొనియాడారు. అత్యంత వైభవంగా కోటి దీపోత్సవం నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఈ ఏడాది కూడా కోటి దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించడం బహుదా ప్రశంసనీయం. శ్రీవేంకటేశ్వర కల్యాణం టీటీడీ వారి సహకారంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్తిక మాసం పవిత్రమయింది. ఈ సందర్భంగా భక్తులందరికీ మోడీ గాని పక్షాన మరోసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Read Also: Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట అణు విస్పోటనాల మాట.. ఉక్రెయిన్‌కు ముప్పు తప్పదా?
కార్తిక మాసంలో కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ ఛైర్మన్ నరేంద్రచౌదరికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ స్వర్ణ రాజరాజేశ్వరి పీఠాధిపతి, మధుమాల మహాసంస్థానం పీఠాధిపతులు రావడం ఎంతో సంతోషం. వర్షాలు లేక భక్తి శ్రద్థలతో దీనిని నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కల్యాణం కనులవిందుగా నిర్వహించారు. కరోనా సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని కోటి దీపోత్సవం చేయడం అభినందనీయం అన్నారు తెలంగాణ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
ఓం నమో వేంకటేశాయ.. కార్తిక మాసంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకం. ఇంత మంది అవకాశం కల్పించిన నరేంద్రచౌదరి దంపతులు, జంటనగరాల భక్తులకు నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమానికి రావడం అదృష్టం. కార్తీక స్నానం, కార్తిక దీపారాధన శుభసూచకం. ఇంత వైభవంగా కోటి దీపోత్సవం ఏర్పాటుచేసి, పీఠాధిపతులతో భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వడం అభినందనీయం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కోటి దీపోత్సవం సామాన్యుల ముందుకి దేవదేవుళ్ళను తీసుకుని వచ్చి పాల్గొనేలా చేయడం. 12 ఏళ్ళుగా కట్టుబాటుతో, భక్తితో, నిబద్ధతతో నిర్వహించడం వారి జన్మధన్యం అన్నారు. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అన్నారు. దీపాలను వెలిగించి చీకటిని పారద్రోలడం, మనిషి జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా, సుఖశాంతులు కలిగించాలని ఇలాంటి వినూత్న కార్యక్రమం నిర్వహించడం చాలా విశిష్టమయినది. కోటి దీపోత్సవంతో ఎన్టీఆర్ స్టేడియం అంతా దేదీప్యమానంగా వెలిగింది. ఇల కైలాసంగా విలసిల్లింది. ఆదివారం కావడంతో వేలాదిమంది భక్తులు కోటిదీపోత్సవం ప్రాంగణానికి తరలిరావడంతో కిక్కిరిసిపోయింది.
Read Also: ఈ టాలీవుడ్ హీరోల భార్యలు హీరోయిన్లకంటే ఎక్కువ సంపాదిస్తారని తెలుసా..?
