బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ భక్షక్. ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన భక్షక్ సినిమాను పులకిత్ తెరకెక్కించారు.భక్షక్ సినిమాను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. దీంతో భక్షక్ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ అయింది.
భక్షక్ చిత్రంలో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్, రాజ్‌పాల్ యాదవ్, సూర్య శర్మ మరియు సంజయ్ మిశ్రా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ హిందీ టీవీ షోలలో సూపర్ సక్సెస్ అయిన సీఐడీలో కీలక పాత్ర పోషించారు. సీఐడీ సీరియల్‌లో అభిజీత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎంతో మందికి ఫెవరెట్‌గా ఉంటుంది. ఆ అభిజీత్ పాత్రను ఆదిత్య శ్రీవాస్తవ భక్షక్ మూవీలో విలన్‌గా చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా బుధవారం (జనవరి 31) భక్షక్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశారు. “ఇది అందరికీ చెప్పాల్సిన కథ. భక్షక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు” అని షారుక్ ఖాన్ ట్రైలర్ వీడియో ను షేర్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు.భక్షక్ ట్రైలర్‌లో విలన్‌గా ఆదిత్య శ్రీవాస్తవ పర్ఫామెన్స్ చాలా బాగుంది. ఆయన ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. సీఐడీ పలు సీరియళ్లలో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన ఆదిత్య ఇందులో బాలికలతో వ్యాపారం చేసే బన్సీ సాహుగా అద్భుతమైన నటనతో ఆకట్టునేలా ఉన్నాడని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక జర్నలిస్టుగా భూమి కూడా అద్భుతంగా నటించారు.. ట్రైలర్ కట్ సీన్స్ కూడా బాగున్నాయి. ట్రైలర్ లోని డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. “ఇతరులు కష్టాల్లో ఉంటే బాధపడని వాళ్లు మనుషులు ఎలా అవుతారు. భక్షక్‌లు అవుతారు” అంటూ ట్రైలర్ చివరిలో భూమి చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భక్షక్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Insaan ya Bhakshak? Samay aa chuka hai chun ne ka!! #Bhakshak a film inspired by true events coming on 9 February, only on Netflix.#BhakshakOnNetflix pic.twitter.com/u3fYQpSys3
— Netflix India (@NetflixIndia) January 31, 2024