నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ”భగవంత్ కేసరి”..ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు.. దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇదివరకు బాలయ్య బర్త్ డే సందర్బంగా భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ టీజర్ తర్వాత చిత్ర యూనిట్ మరొక అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మేకర్స్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్.అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది.దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఆగస్టు మూడవ వారం నుండి ఈ సినిమా కు సంబంధించి వరుస అప్డేట్ రానున్నట్టు తెలుస్తుంది.దీంతో ఇక నుండి భగవంత్ కేసరి మేనియా మొదలవబోతుందని నందమూరి అభిమానులు ఎంతగానో ఆనందంగా వున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ మరియు వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో కూడా అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నారు.