నందమూరి నటసింహం బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ లీల బాలయ్య కు కూతురి గా నటిస్తుంది.. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా కథ గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి.ఈ సినిమాలో బాలయ్య కుమార్తె గా శ్రీ లీల కనపించనుంది. అయితే సినిమా లో ఆమెకు తన తండ్రే బాలయ్య అని మాత్రం తెలియదు. బాలయ్య జైలు నుంచి బయిటకు వచ్చి తన కుటుంబాన్ని నాశనం చేసిన వారి పై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. తన కూతురి కోసం బాలకృష్ణ చేసే ప్రయత్నమే భగవంత్ కేసరి సినిమా అని దాదాపు ఈ కథతో నే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.. గతంలో ఇలాంటి కథతోనే ముమ్మట్టి నటించిన కంకణం అనే సినిమా వచ్చింది.
ఈ చిత్రం తెలుగులో మోహన్ బాబు తో ఖైదీ గారు పేరుతో రీమేక్ కూడా చేయబడింది .దాదాపు అది ఇలాంటి కథే అని అంటున్నారు. మరో ప్రక్క బాలీవుడ్ లో 1992 లో వచ్చిన ఖుదా గవా సినిమాకు భగవంత్ కేసరికి దగ్గర పోలికలు ఉన్నట్టుగా సినీవర్గాల్లో చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి ఇలా వస్తున్న రూమర్స్ పై చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవ్వబోతుంది.. అదే సమయం లో బాలయ్య సినిమాతో పాటు తమిళ హీరో విజయ్ ‘లియో’, సినిమా అలాగే మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో ‘భగవంత్ కేసరి’ సినిమా పోటీకి సిద్ధం అయింది.మరి బాలయ్య మళ్ళీ దసరా హీరోగా నిలుస్తాడో లేదో చూడాలి.